సినీ పరిశ్రమలోకి ఒక సాధారణ డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్ తర్వాత కొరియోగ్రాఫర్ గా మారారు.  ఆ తర్వాత స్టార్ హీరోలకు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా పని చేసి మంచి మార్కులు కొట్టేశాడు.  రాఘవ లారెన్స్... జీవితంలో ఎన్నో కష్టాలను ఓడ్చి.. కిందిస్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తి... డ్యాన్సర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు... ఇలా అన్ని రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. సినీ ఫీల్డ్ లో ఆయన చేసిన ఓ వినూత్న ప్రయోగం ఇప్పటికీ సక్సెస్ గా సాగుతుంది.  ముని లాంటి కామెడీ , హర్రర్ కాన్సెప్ట్ తో మంచి  విజయం సాధించాడు.  ఆ మూవీ సీక్వెల్ గా కాంచన, కాంచన 3 తీసి మంచి విజయాలు అందుకున్నాడు.   సినీ ప్రముఖుడిగానే కాదు, సామాజిక సేవా కార్యక్రమాలతోనూ ఆయన గుర్తింపు అందుకున్నారు.

 

ముఖ్యంగా, దివ్యాంగుల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు, ఎంతో ఆర్థిక సాయం చేశారు. తన సినిమాల్లో ఏదో ఒక సందర్భంలో కానీ, పాటలో కానీ దివ్యాంగులు ఉండేలా చూసుకుంటారు. ఆయన ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించారు.  ఎంతో మంది అనాధలకు, అనాధ వృద్దులను చేరదీసి వారికి తన వాడిగా సేవలు అందిస్తున్నారు.  ఎక్కడైనా ప్రకృతి విపత్కర పరిస్థితులు ఏర్పడితే వెంటనే తనవంతు ఆర్థిక సహాయం అందిస్తు ఉంటారు. 

 

ఆ మద్య కేరళాలో ఓ వృద్దురాలు వరదల్లో పూర్తిగా నష్టపోయినందుకు ఆమెకు ఇల్లు కట్టించి తాను స్వయంగా ఇంట్లోకి తీసుకు వెళ్లాడు.  తాజాగా తన ట్రస్టు హైదరాబాద్ విభాగంలో శివకుమార్ అనే దివ్యాంగుడికి కీలక బాధ్యతలు అప్పగించారు. దీనిపై లారెన్స్ స్వయంగా వెల్లడించారు. "శివకుమార్ ఎంతో నిజాయతీ ఉన్న కుర్రాడు. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ట్రస్ట్ బాధ్యతలు ఓ దివ్యాంగుడికి ఇవ్వడం అందరూ హర్షిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: