గత దశాబ్దంలో అభిమానులను కలవరపెట్టిన బిగ్గెస్ట్ గాసిప్స్‌లో ఒకటి రానా ఆరోగ్యం గురించి వచ్చిన వార్త. బాహుబలి సినిమాల్లో భల్లాలదేవుడిగా భారీకాయంతో కనిపించిన రానా తరువాత క్రమంగా లావు తగ్గుతూ వచ్చాడు. అయితే అదే సమయంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌లో చంద్రబాబు పాత్రలో కనిపించటంతో ఆ పాత్ర కోసమే లావు తగ్గాడని అంతా భావించారు. కానీ ఆ సినిమా తరువాత కూడా రానా భారీగా బరువు తగ్గాడు. దీంతో అభిమానుల్లో కలవరం మొదలైంది.

 

అదే సమయంలో రానా అమెరికాకు వెళ్లిపోయాడు. దీంతో రానా ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు వినిపించాయి. ముందుగా రానా కంటి ఆపరేషన్‌ నిమిత్తం అమెరికా వెళ్లాడన్న వార్తలు వినిపించాయి. తరువాత రానా తీవ్ర ఆరోగ్య సమస్యతో ఇబ్బందిపడుతున్నాడని. అతని కిడ్నీ పూర్తిగా పాడవ్వటంతో కిడ్నీ మార్పిడి చికిత్స జరుగుతుందన్న ప్రచారం జరిగింది. అంతేకాదు మరో అడుగు ముందుకు వేసి రానాకు తల్లి కిడ్నీ ఇచ్చిందన్న న్యూస్ కూడా వైరల్‌ అయ్యింది.

 

అయితే తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలను రానా పలుమార్లు ఖండించినా అమెరికా ఎందుకు వెళ్లింది. సినిమా షూటింగ్‌లకు అంత లాంగ్ బ్రేక్‌ ఎందుకు ఇచ్చాడు అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో రానా ఆరోగ్య విషయంలో రూమర్స్ అలాగే కొనసాగాయి. ఒక సమయంలో రానా తండ్రి సురేష్‌ బాబు కూడా రానా హెల్త్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్పాడు. అయితే ఆ సమస్య ఏంటి అన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం రానా తిరిగి వచ్చాడు. షూటింగ్‌లకు హాజరవుతున్నాడు. అరణ్య సినిమాను రిలీజ్‌కు రెడీ అయ్యింద. అయినా అసలు రానాకు ఏం అయ్యింది. అంతకాలం అమెరికాలో ఏం చేశాడు అన్నది మాత్రం ఇప్పటికీ ఓ పెద్ద క్వశ్చన్‌ మార్కే.

మరింత సమాచారం తెలుసుకోండి: