అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ మేనమామ నాగార్జున సపోర్ట్ ఉన్నా సరే పెద్దగా మెప్పించలేదు. కాళిదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ తన ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా వర్క్ అవుట్ అవట్లేదు. రెండేళ్ల క్రితం వచ్చిన చిలసౌ సినిమా మాత్రం సుశాంత్ కు మంచి హిట్ ఇచ్చింది. రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.  

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలో సుశాంత్ ఒక చిన్న పాత్రలో మెప్పించాడు. చెప్పడానికి చిన్న పాత్రే అయినా అది చాలా మంచి ఇంప్యాక్ట్ కలుగచేసింది. త్రివిక్రం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు సుశాంత్. అల హిట్ తో సుశాంత్ కెరియర్ కూడా ఇక మీదట సక్సెస్ ఫుల్ గా సాగుతుందని భావిస్తున్నారు. అయితే ఇదే జోష్ లో సుశాంత్ కు ఓ యాడ్ కూడా వచ్చింది. వచ్చేది వేసవ్ కాలం కాబట్టి శీతలపానీయం స్ప్రైట్ యాడ్ లో తళుక్కున మెరిసాడు సుశాంత్.

 

ఈమధ్య రెక్సోనా యాడ్ లో సమంతతో పాటుగా నాగ చైతన్య కనిపిస్తున్నాడు. కాని సుశాంత్ సోలోగా స్ప్రైట్ యాడ్ పట్టేశాడు. ఈ యాడ్ చూసిన అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. సరైన ఛాన్స్ వస్తే సుశాంత్ తన సత్తా చాటుతాడని చెప్పడానికి ఈ యాడ్ కూడా ఒక ఉదహరణ. చూస్తుంటే ఇక సుశాంత్ కూడా కెరియర్ లో జాగ్రత్త వహించి వరుస హిట్లు కొట్టేలా ఉన్నాడు. సుశాంత్ వాణిజ్య ప్రకటన చేయడం చూస్తుంటే అతనికి మంచి రోజులు వచ్చినట్టే ఉన్నాయి. ప్రస్తుతం సుశాంత్ ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమా చేస్తున్నాడు. ఇక మీదట సుశాంత్ కూడా స్టార్ లీగ్ లో ఉండేలా తన కథల సెలక్షన్స్ ఉంటుందని తెలుస్తుంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: