చిరంజీవి రాజశేఖర్ ల మధ్య గ్యాప్ కొన్ని సంవత్సరాలుగా కోన సాగుతూనే ఉంది. మధ్యలో వీరిద్దరు కలిసిపోయినట్లు కనిపించినా ఆ శతృత్వం ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. మా డైరీ 2020 ఆవిష్కరణలో రాజశేఖర్ ప్రవర్తించిన తీరును నిరసిస్తూ చిరంజీవి అసహనానికి గురి కావడమే కాకుండా రాజశేఖర్  వ్యవహారాన్ని ‘మా’ సంస్థ క్రమశిక్షణ సంఘం కు రిఫర్ చేయడంతో రాజశేఖర్ అసహనానికి లోనై మా సంస్థలో తన పదవికి రాజీనామా ఇచ్చినా ఇంకా రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి.


ఇలాంటి పరిస్థితులలో రాజశేఖర్ మరొకసారి చిరంజీవితో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు.  దాదాపు 5 సంవత్సరాల క్రితం ప్రారంభించిన రాజశేఖర్ నటించిన ‘అర్జున్’ మూవీ ఇప్పుడు తన ఆర్ధిక బాధలు తొలిగించుకుని విడుదల అవుతోంది. ఈ మూవీ నిర్మాత పడుతున్న కష్టాలు చూసి రాజశేఖర్ తనకు రావలసిన పారితోషికం కూడ వదులుకున్నాడు  అన్నప్రచారం జరుగుతోంది. 


త్వరలో విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్ ను ప్రారంభించి ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసారు. అయితే ఈ ట్రైలర్ లో రాజశేఖర్ నోటి వెంట వచ్చిన డైలాగ్ చిరంజీవి రాజకీయాలను టార్గెట్ చేస్తూ ఉంది అంటూ మళ్ళీ ఒక సరికొత్త వివాదం మొదలైంది. 


‘పార్టీ ఓపెన్ చేయగానే టిక్కెట్లు అమ్ముకుని పని అయిపోగానే పార్టీనే అమ్ముకోడానికి కాదురా పెట్టింది ఈ పార్టీ’ అంటూ రాజశేఖర్ చెప్పిన డైలాగ్ చిరంజీవి ‘ప్రజారాజ్యాన్ని’ టార్గెట్ చేసే విధంగా ఉంది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే చిరంజీవితో ప్రత్యక్ష వైరం తెచ్చుకుని చాల నష్టపోయిన రాజశేఖర్ తనకు ఎన్ని నష్టాలు వచ్చినా రాజీ పడడు అన్న విషయం ఈ సినిమాలోని డైలాగ్ మరొకసారి రుజువు చేస్తోంది. అయితే ఎప్పుడో ఆగిపోయిన ఈ సినిమా ఇప్పుడు విడుదల అవుతున్న పరిస్థితులలో అంచనాలు ఉన్న సినిమాలు కూడ పేలిపోతున్న రోజులలో ఇప్పుడు రాజశేఖర్ ‘అర్జున్’ ను ఎవరు పట్టించుకుంటారు అన్నదే సమాధానం లేని ప్రశ్న..

మరింత సమాచారం తెలుసుకోండి: