రానా... తాత వారసత్వంలో అదే పేరుతో సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ఎంత పాపులారిటీ ఉన్నా యూత్ లో ఎంత క్రేజ్ ఉన్నా సరే రానా ఒదిగి ఉంటాడు అనే పేరు ఉంది. వరుసగా సినిమాలు చేయకపోయినా సరే మంచి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు రానా. తండ్రి నిర్మాత... అగ్ర నిర్మాత అయినా సరే ఈ హీరో అగ్ర దర్శకులతో సినిమాలు చెయ్యాలి అనుకోలేదు. చిన్న చిన్న దర్శకులతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. కొత్త దర్శకుల ప్రతిభను అపారంగా నమ్మాడు. 

 

ఇది పక్కన పెడితే ఇతనికి ప్రేమ వ్యవహారాలు కూడా ఎక్కువే అనేది టాలీవుడ్ జనాల మాట. ఎందరో హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు నడిపాడు అంటుంది. ముఖ్యంగా త్రిషా, బిపాసా బసు విషయంలో ఎక్కువగా ఈ వార్తలు వచ్చాయి. తనకంటే పెద్దది అయిన బిపాసా బసు ని అతను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ వార్తలు ఎక్కువగా హల్చల్ చేసాయి అప్పట్లో. కాని మేము ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అన్నాడు. పెళ్లి చేసుకోను అని స్పష్టంగా చెప్పేసాడు. అసలు మా మధ్య అలాంటిది ఏమీ లేదని కుండబద్దలు కొట్టాడు. 

 

ఇకపోతే త్రిష తో అతను పెళ్లి వరకు వెళ్ళాడని, పెళ్లి చేసుకున్నాడని, పెద్దలను ఒప్పించాడు అని ఎవరికి తోచింది వాళ్ళు అప్పట్లో వార్తలు రాసారు. ముఖ్యంగా వాళ్ళు ఇద్దరూ చెన్నై లో రహస్యంగా వివాహం చేసుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కాని ఆ తర్వాత గొడవలు రావడం తో అంతే రహస్యంగా విడిపోయారు అని కూడా చెప్పింది మీడియా. దీని గురించి బయటకు పెద్దగా వార్తలు రాకపోయినా వీళ్ళది ప్రేమ వ్యవహారమే అంటూ చాలా మంది మాట్లాడారు. సూచీ లీక్స్ లో కూడా వీళ్ళ ఫోటోలు బయటపడి సంచలనం సృష్టించాయి అప్పట్లో.  ఇప్పుడు ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: