నటి నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ఈమె గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అందం, అభినయంతో ఆకట్టుకునే నయనతార ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 15 ఏళ్ల సినీ ప్రస్థానంలో పలు భాషల్లో సినిమాలు చేసి లేడి సూపర్ స్టార్ గా ఎదిగిందీమె. ఇప్పుడు సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా కూడా నయనతార రికార్డు సృష్టించింది. వాస్త‌వానికి 2004లో వచ్చిన చంద్రముఖి సినిమా నయనతార లైఫ్ ను మలుపుతిప్పింది. రజినీకాంత్ స‌ర‌స‌న న‌టించిన ఈ బ్యూటీకి ఆ త‌ర్వాత ఛాన్సులు వెతుక్కుంటూ వ‌చ్చాయి.

 

ప్ర‌స్తుతం తమిళంలో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ లేడీ సూపర్ స్టార్‌గా మంచి క్రేజ్‌ను సంపాదించుకుంటున్నారు నయన్. అలాగని స్టార్‌ హీరోల చిత్రాలను పక్కన పెట్టడం లేదు. కిందటేడాది ఏకంగా ఏడు సినిమాల్లో నటించారు. వాటిలో సైరా, బిగిల్ వంటి భారీ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటికి సై అంటున్న నయనతార. వేటికి అంటే.. చిట్టిపొట్టి డ్రస్సులకు, బికినీలకు, ముద్దుసీన్లకు సై అంటోందట న‌య‌న్‌.

 

వాస్త‌వానికి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న నయనతార ఇప్పటి వరకు బికినీకి నో చెబుతూ వచ్చింది. కెరీర్ మొదట్లో చాలా హాట్‌గా కనిపించి, ప్రేక్షకులకు కావాల్సినంత కనువిందు అందించింది.  కేక పుట్టించే ఫిగర్‌తో బికినీ షాట్‌లలో నటించింది. అయితే, కెరీర్‌లో ఎదుగుతున్న కొద్దీ ఎక్స్‌పోజింగ్‌కు నో చెబుతూ వచ్చింది. అలాంటి కథలు చెప్పడానికి వచ్చినా సరే సారీ అని ఖరాఖండీగా చెప్పేసేది.  అలాంటిది ఇప్పుడు వాటికి కూడా సై అంటోంద‌ట‌. కథ డిమాండ్‌ చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. 

 

నయనలో ఈ మార్పును చూసి దర్శకనిర్మాతలు పండగ చేసుకుంటున్నారట. ఎందుకంటే ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌ అనదగిన వారిలో నయనతార తప్ప ఎవరూ లేరు. అలాంటి నయనతారతో బికినీలు వేయించి ముద్దు సీన్లు పెడితే సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడం ఖాయమని అంటున్నారట. కాగా, నయనతారలో ఈ మార్పు రావడానికి ప్రధాన కారణం ఆమె చేతినిండా సినిమాలు లేకపోవడమేనని అంటున్నారు. రెమ్యున‌రేష‌న్ విషయంలో నిర్మాతలు అసహనంతో ఉండటం, చేతిలో సినిమాలు తక్కువగా ఉండటం వల్ల కెరీర్ డేంజ‌ర్‌లో పడే అవకాశం ఉందని గ్రహించిన న‌య‌న‌తార పాపం వాటికి కూడా సై అంటున్న‌ట్టు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: