‘కాటమరాయుడు’ సినిమా తరువాత శృతిహాసన్ ఒక్క సినిమాలో కూడ నటించలేదు. తన ప్రేమ వ్యవహారం బ్రేకప్ అయిన తరువాత తెలుగు సినిమాలలో ఆమె నటించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఆమె గురించి ఏ టాప్ హీరో పట్టించుకోవడం లేదు. దీనికితోడు ఆమెకు గ్లామర్ తగ్గింది అని కామెంట్స్ వస్తున్న పరిస్థితులలో శృతి సన్నపడటానికి ప్రయత్నించి ఈమధ్య తన ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకుంది.


లేటెస్ట్ గా ఆమె ముక్కుకు సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ ఆవ్వడంతో ఆ ఫోటోలను చూసి చాలామంది శృతి ఎందుకు ఇలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ ఆమె దృష్టి వరకు రావడంతో ఆమె రేచ్చిపోతు ఏకంగా తన పై విమర్శలను చేస్తున్న వారిని టార్గెట్ చేస్తూ మాటల దాడికి దిగింది. 


ఒక వ్యక్తి లుక్ ఎలా ఉండాలి అన్న విషయం నిర్ణయించడానికి మీరు ఎవరు అంటూ శృతి ఎదురు ప్రశ్నలు వేస్తోంది. అంతేకాదు తాను నటించే సినిమాల పాత్రల పై విమర్శలు చేస్తే సహిస్తాను కాని తన లుక్ పై కామెంట్స్ చేసే అధికారం ఎవరికి ఉంది అంటూ శృతి ఏకంగా తన అభిమానులనే టార్గెట్ చేస్తోంది.


ఈమెకు సోషల్ మీడియాలో 14 మిలియన్స్ కు పైగా ఫాలోయర్స్ ఉండటంతో శృతి సినిమాలు చేసినా చేయకపోయినా ఆమెను ఫాలో అవుతున్న అభిమానులు సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒకనాటి అందాల రాశి శ్రీదేవి తన ముక్కు కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తరువాత ఆమె బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగి పోయింది. ఇప్పుడు అలాంటి అదృష్టమే తనకు కూడ కలుగుతుందని శృతి ఇలా ప్లాస్టక్ సర్జరీ చేయించుకున్నది అనుకోవాలి. వాస్తవానికి చిరంజీవి కొరటాల మూవీలో శృతి ని హీరోయిన్ గా పెట్టాలని కొరటాల భావించినా చిరంజీవి శృతి ని కాదని త్రిష కు ఓటేసాడు. ఇప్పుడు ఆ విషయం కూడ శృతి ఇలా అసహనానికి కారణం అయి ఉండవచ్చు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: