మొన్నటి వ‌ర‌కూ ఆ మూవీలో లిప్‌లాక్ లేదు అని అంద‌రూ చెప్పుకుంటూ వ‌చ్చారు. కాని ఇప్పుడు మాత్రం ఆ మూవీలో అదే హైలెట్ అని అంటున్నారు. ఇదంతా టాలీవుడ్‌లో త్వర‌లోనే రిలీజ్ కాబోతున్న మూవీ ఆహాక‌ళ్యాణంకు సంబంధించిన మేట‌ర్‌. వెల్‌, మేట‌ర్ ఏంటంటే బాలీవుడ్‌లో సూప‌ర్ స‌క్సెస్‌ను పొందిన బ్యాండ్ బ‌జా భార‌త్ మూవీకు రిమేక్‌గా తెలుగులో ఆహాక‌ళ్యాణం మూవీ తెర‌కెక్కింది. ఈ మూవీలో హీరోగా నాని న‌టించ‌గా, హీరోయిన్‌గా వాణిక‌పూర్ న‌టించింది. వీరిద్దరూ న‌టించిన ఆహాక‌ళ్యాణం మూవీ ఈ నెల 21న ధియోట‌ర్లలో రిలీజ్ అవుతుంది. మొన్నటి వ‌ర‌కూ ఈ మూవీలో లిప్‌లాక్ సీన్స్ లేవ‌ని హీరో నాని స్టేట్‌మెంట్ ఇచ్చుకుంటూ వ‌చ్చాడు. ప్రొడ‌క్షన్ టీం నుండి ఎపిహెరాల్డ్‌.కామ్‌కి అందిన స‌మాచారం మేర‌కు ఈ మూవీలో లిప్‌లాక్ సీన్ అనేది హైలెట్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. ఓ పెళ్ళికి అటెండ్ అయిన నాని,వాణిక‌పూర్‌లు అనుకోని విధంగా లిప్‌లాక్ చేసుకుంటారని అందిన స‌మాచారం. అయితే, మొద‌ట్లో ఈ సీన్‌కు నాని ఇష్టప‌డ‌లేదంట‌. కాని వాణిక‌పూర్ మాత్రం నానిను రెచ్చగొట్టి మ‌రీ లిప్‌లాక్ సీన్‌లో న‌టించేవిధంగా హీరోను చేసింద‌ని ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీ ప్రమోష‌న్‌లో భాగంగా వాణిక‌పూర్ ఈ విష‌యాన్ని ఓ త‌మిళ్ టెలివిజ‌న్‌లో చెప్పిన‌ట్టు కోలీవుడ్ ఇండ‌స్ట్రీ టాక్‌. మొత్తానికి నాని సిగ్గుప‌డి, ఇష్టప‌డిన చేసిన లిప్‌లాక్ అని హీరోయిన్ ముద్దుగా చెప్పుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: