పవర్ స్టార్ పవన్ కళ్యాన్ దయవల్ల కత్తి మహేష్, శ్రీ రెడ్డి ల మధ్య స్నేహబంధం ఏర్పడిందని చాలామంది అభిప్రాయపడుతుంటారు. వీళ్లిద్దరూ పవన్ కళ్యాణ్ పై తరచుగా మండిపడుతూ తమ అభిప్రాయాలు ఒకటేనని చెప్పకనే చెబుతారు. అయితే, ప్రతిరోజు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తున్న వీరిద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో అది పే-ద్ద వార్త అవుతుంది. ఐతే గతంలో నిజంగానే వీళ్ళు ఒక ఇంటర్వ్యూ చేసి పెద్ద దుమారమే రేపారు. ఐతే ఆ ఇంటర్వ్యూ కి సంబంధించిన హైలెట్స్ ని శ్రీ రెడ్డి తన ఫేసుబుక్ ఖాతాలో పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తుంది.




ఇక ఆ ఇంటర్వ్యూ యొక్క హైలెట్స్ ని తెలుసుకుంటే... మొట్టమొదటగా శ్రీ రెడ్డి మహేష్ ను మీరు ఎప్పుడు మీ శీలాన్ని పోగొట్టుకున్నారు? అని పచ్చి బూతు అయిన ప్రశ్న అడిగింది. శ్రీ రెడ్డి సిగ్గులేకుండా ఆ ప్రశ్న వేసినా... కత్తి మహేష్ కూడా సిగ్గులేకుండా సమాధానం ఇచ్చాడు. అతడు మాట్లాడుతూ... 'పోగొట్టుకోవడం అనేది ఒక యాక్సిడెంట్ సంఘటన. నేను అది ఆక్సిడెంటల్ గా పోగొట్టుకోలేదు కానీ పెళ్లి అయిన తర్వాత అది ఆటోమేటిక్ గా జరిగిపోయింది. ఆ తర్వాత అలా నాకు అనుభవం వచ్చి పెద్ద మనిషి అయ్యా', అని చెప్పుకొచ్చారు.




అయితే ఇంకో ప్రశ్న వేసిన శ్రీ రెడ్డి కత్తి మహేష్ ను ఇరకాటంలో తోసేసింది. తాను ప్రశ్నిస్తూ... మీరు ఎవరినైనా లవ్ చేశారా? కొంపతీసి నన్ను లవ్ చేసారా? అంటూ సిగ్గులొలికిస్తూ కత్తి మహేష్ ను అడుగుతుంది. వెంటనే స్పందించిన కత్తి మహేష్... 'వై, నాట్! వాస్తవానికి మనిద్దరం పెళ్లి చేసుకోవాలని పవన్ కళ్యాణ్ అభిమానులు బాగా కోరుకుంటున్నారు తెలుసా? కానీ నాకు ఇంకా విడాకులు రాలేదు', అని కత్తి మహేష్ అంటాడు. దీంతో ఒకవేళ మీ భార్యకు నువ్వు విడాకులు ఇస్తే నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆశ పడ్డట్టు ఆమె చూస్తుంది. ఏదేమైనా ఇద్దరికీ ఒకరికి ఒకరు అంటే ఇష్టమని వారి మొహాలను చూస్తుంటే తెలిసిపోతుంది. ప్రస్తుతం ఫేసుబుక్కులో పోస్టు చేసిన ఈ వీడియో కింద కామెంట్స్ సెక్షన్ లో 'శ్రీరెడ్డి, కత్తి మహేష్ పెళ్లి చూడాలని ఉంది', అంటూ వేల మంది నెటిజన్లు కోరుకుంటున్నారు. మరి భవిష్యత్తులో నెటిజన్లు కోరినట్టుగా వీళ్లిద్దరు సహజీవనం చేస్తారో చూడాలిక.



మరింత సమాచారం తెలుసుకోండి: