యూత్ కు ఐకాన్ లా మారిపోయిన విజయ్ దేవరకొండ కు నడుస్తున్న కాలం ఏమాత్రం కలిసిరావడం లేదు అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాను కొనుక్కుని ఘోరంగా నష్టపోయిన ఈ మూవీ బయ్యర్లు తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ లో విజయ్ దేవరకొండ కు వ్యతిరేకంగా ఫిర్యాదు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 


‘వరల్డ్ ఫేమస్ లవర్’ నష్టాల గురించి వివరించి తమను ఆదుకోమని విజయ్ దేవరకొండను కలవాలని ప్రయత్నించినా విజయ్ కనీసం అపాయింట్ మెంట్ కూడ ఇవ్వకపోవడం డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లు టాక్. దీనితో ఈ డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చిన ఫిర్యాదును తీసుకుని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఈ మూవీ నిర్మాత రామారావును పిలిపించి అడిగితే రామారావు డిస్ట్రిబ్యూటర్లకు ఎంతోకొంత సహాయం చేయడానికి తాను రెడీగా ఉన్నా హీరో విజయ్ దేవరకొండ ఏమాత్రం సహకరించడం లేదనే విషయాన్ని బయట పెట్టినట్లు తెలుస్తోంది. 


దీనితో అసహనానికి లోనైన తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెద్దలు పూరీ జగన్నాథ్ కు మెసేజ్ పెడుతూ ఈ విషయంలో పూరీ శ్రద్ధ తీసుకోకపోతే పూరీ విజయ్ తో తీస్తున్న లేటెస్ట్ మూవీని తెలుగు రాష్ట్రాలలో బయ్యర్లు తీసుకోకుండా ఆంక్షలు విధిస్తామని ఘాటుగా మెసేజ్ పెట్టినట్లు సమాచారం. జరుగుతున్న పరిణామాలు పూరీ జగన్నాథ్ దృష్టి వరకు వెళ్ళడంతో ఎలర్ట్ అయిన పూరీ ఈ విషయంలో తాను సద్దుబాటు చేస్తానని ఖంగారు పడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని పూరీ రాయబారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 


ఇప్పటికే వరస ప్లాప్ లతో మార్కెట్ పడిపోయిన విజయ్ దేవరకొండ గురించి తెగ టెన్షన్ పడుతున్న పూరీకి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కష్టాలు మరిన్ని తలపోట్లు తెచ్చి పెడుతున్నాయని సమాచారం. దీనితో పూరీ విజయ్ తో తీస్తున్న తన లేటెస్ట్ మూవీ చిత్రీకరణ విషయంలో తన సహజ శైలికి భిన్నంగా ప్రవర్తిస్తూ చల్ల స్లోగా ఈ సినిమాను పూర్తి చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: