జగపతి బాబు... టాలీవుడ్ లో ఒక వెలుగు వెలుగు వెలిగి ఆరిపోయిన హీరో. అగ్ర నిర్మాత కొడుకుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. హీరోగా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు జగపతి బాబు. ఆ తర్వాత కెరీర్ ఇబ్బంది పడింది. వరుసగా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మంచి హిట్ కోసం ఎంత ఎదురు చూసినా సరే ఆయనకు హిట్ దక్కలేదు. ఎన్ని సినిమాల్లో ప్రయోగాలు చేసినా సరే జగపతి బాబు మాత్రం హిట్ ట్రాక్ ఎక్కలేదు అనేది వాస్తవం. 

 

ఆ తర్వాత ఆయన కెరీర్ ని లెజెండ్ సినిమా మలుపు తిప్పింది. ఇక ఇది పక్కన పెడితే జగపతి బాబు కెరీర్ లో అఫైర్ల గురించి కూడా ప్రచారం ఎక్కువగా జరిగేది. జగపతి బాబు ఆమని మధ్య ఏదో ఉందీ అంటూ ప్రచారం జరిగింది. వాళ్ళు ఇద్దరూ వివాహం చేసుకుంటారు అని కొందరు అంటే లేదు చేసుకుంటారు అని మరికొందరు ఇలా హడావుడి చేసే వాళ్ళు. వాళ్ళు ఇద్దరూ కలిసి నటించిన శుభమస్తూ, శుభలగ్నం, మావి చిగురు సినిమాలు మంచి హిట్స్  గా నిలిచాయి. ఈ మూడు సినిమాల్లో ఈ జోడిని చూసి అభిమానులు ఎన్నో ఊహించుకునే వాళ్ళు. 

 

వాళ్ళు ఇద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని సినీ జనాలు కూడా అనే వాళ్ళు. ఒక ఇంటర్వ్యు లో జగపతి బాబు ని ఒకరు అడిగారు. మీరు పెళ్లి చేసుకుంటే బాగుండేది అంటూ అడగగా జగ్గూ భాయ్... అప్పటికే నాకు పెళ్లి అయిపోయింది అంటూ సమాధానం ఇచ్చారు. అంటే పెళ్లి చేసుకోకపోతే చేసుకునే వాళ్ళు ఆమనిని అంటూ మీడియా వార్తలు రాసింది. జగపతి బాబు ఇప్పుడు కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలు చేస్తూ విలన్ గా తండ్రిగా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: