నేచుర‌ల్ స్టార్ నాని నిర్మాత‌గా యంగ్ క్రేజీ హీరో విశ్వ‌క్‌సేన్ హీరోగా తెర‌కెక్కిన సినిమా హిట్‌. సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ ద‌గ్గ‌ర నుంచి రిలీజ్ అయ్యే వ‌ర‌కు ఈ సినిమా ప్ర‌మోష‌న్లు అంతా చాలా కొత్త‌గా సాగాయి. నూతన దర్శకుడు శైలేష్ కొలను విశ్వక్ సేన్ ని ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తూ చేసిన ‘హిట్’ సినిమాలో, హిట్ అనిపించుకునే ఒక క్రైమ్ థ్రిల్లర్ లో ఉండాల్సిన అన్నీ ఉన్నాయి. సినిమా క‌థ క‌న్నా స్క్రీన్ ప్లేతో చేసిన మ్యాజిక్ తో పాటు మ‌లుపులు తిరిగిన క‌థ‌నం... సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ లా ఉన్న సీన్లు ఇవ‌న్నీ సినిమాకు చాలా ప్ల‌స్ అయ్యాయి.



విశ్వక్ సేన్ ఇంటెన్స్ పెర్ఫార్మన్స్, గ్రిప్పింగ్ ఫస్ట్ హాఫ్, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే క్రైమ్ రివీలింగ్ పాయింట్స్ వ‌చ్చిన‌ప్పుడు ప్రేక్ష‌కులు ఒక్క‌సారిగా సీట్ల‌లో నుంచి లేచి విజిల్స్ వేయాల్సిందే. అలాగే సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ హంగులు ఎక్కువ కావాలి. అవి పూర్తిగా మిస్ అయ్యాయి. సినిమాలో ప్ల‌స్ పాయింట్లు ఎన్ని ఉన్నాయో... ప్రేక్షకులని నిరాశ పరిచే కొన్ని అంశాలు కూడా ఉన్నాయి.  ఇంట‌ర్వెల్ ట్విస్ట్ వ‌చ్చాక ప్రేక్ష‌కుడు ఒక్క సారిగా షాక్‌లోకి వెళ్లిపోతాడు.



అస‌లు ఈ బ్రేక్ ఎందుకు వ‌చ్చి చ‌చ్చింది... సినిమా కంటిన్యూ చేసేయండి.. ఇప్పుడే సెకండాఫ్ కూడా వేసేయండ‌ని అనుకునేంత బాగా ఫ‌స్టాఫ్ డీల్ చేశాడు. సెకండాఫ్ లో ఒక స్టేజ్ తర్వాత డ్రాగ్ అనిపించే ఇన్వెస్టిగేషన్ సీన్స్, క్రైమ్ రీజన్ బెటర్ గా లేద‌న్న ఫీలింగ్ ప్రేక్ష‌కుడికి క‌లుగుతుంది. అయితే అప్ప‌టి వ‌ర‌కు మాంచి మ‌సాలా సీన్ల‌తో సినిమా ఉండ‌డంతో ఆ ఫీలింగ్‌తో ప్రేక్ష‌కుడు సినిమా ప‌ర్వాలేద‌న్న పాజిటివ్ ఫీలింగ్‌తోనే బ‌య‌ట‌కు వ‌స్తాడు.



ఓవరాల్ గా ‘హిట్’ సినిమా థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ ని పూర్తిగా డిజప్పాయింట్ చేయదు, అలా అని మ‌రీ సూప‌రెహే అన్న‌ట్టుగా కూడా ఉండ‌దు. బ‌ట్ ఓవ‌రాల్‌గా మాత్రం మంచి సినిమాగా నిలుస్తుంది.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: