నయనతార... ప్రస్తుతం తమిళంలో స్టార్ హీరోయిన్. అక్కడ వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ అమ్మడు. వచ్చిందే ఛాన్స్ అని భారీగా పారితోషికం కూడా డిమాండ్ చేస్తుంది ఈ భామ. దీనితో నిర్మాతలు కూడా ఇప్పుడు ఈమెతో సినిమా అనగానే భయపడే పరిస్థితి ఏర్పడింది అనేది వాస్తవం. ఇక ఇదిలా ఉంటే ఈమెకు ఉండే ప్రేమ కథల గురించి మీడియా ఎన్నో వార్తలు రాస్తూ వచ్చింది. అవును ఆమెకు ఎందరితోనో పెళ్ళిళ్ళు చేసింది మీడియా. అలాగే ఆమె పెళ్లి డేట్స్ కూడా ప్రకటించింది. 

 

నయనతార కు గ్లామర్ ఎక్కువ కావడంతో ముందు ఒక తమిళ హీరోతో ఆమె ప్రేమలో ఉంది అన్నారు. ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ తో ఒక సినిమా చేసింది. అప్పుడు ఆమెకు ప్రభాస్ తో ఉంది వాళ్ళు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అన్నారు. ఇక ఆ తర్వాత ప్రభుదేవా పేరుతో పాటుగా శింబు పేరు కూడా వినపడింది. శింబు ని ఆమె పెళ్లి చేసుకునే అవకాశం ఉందని కథనాలు వచ్చాయి. ఆ సమయంలో ఆమె గర్భవతి కూడా అయ్యారు. దీనితో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలిసి తెలియక ఎందుకు రాస్తున్నారు అని మీడియా మీద ఫైర్ అయిపోయింది. 

 

ఇక ప్రభుదేవా తో మాత్రం పెళ్లి వరకు వెళ్ళింది. మళ్ళీ శివ కార్తికేయన్ తో ఆమె ప్రేమలో పడింది అన్నారు. కొన్నాళ్ళు రానా పేరు కూడా వినపడింది. రామానాయుడు అంగీకరించారు అన్నారు. ఆ తర్వాత మరో పెళ్లి వార్త నయన్ ని ఇబ్బంది పెట్టింది. విజయ్ సేతుపతిని ఆమె పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇక ఇప్పుడు విజ్ఞేశ్ శివన్ తో ఆమె డేటింగ్ లో ఉంది. ఈ ప్రేమ వ్యవహారాలతో ఆమె చాలానే నష్టపోయింది కూడా. ఆర్ధికంగా కూడా ఆమె ఇబ్బంది పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: