కొన్ని వారాల క్రితం విశ్వక్ సేన్ నటించిన హిట్ సినిమా యొక్క టైలర్, టీజర్లు విడుదలై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లాయి. అయితే ఈ రోజు హిట్ సినిమా విడుదల కావడంతో... ప్రేక్షకుల అంచనాలను మీట్ అయ్యేలా హిట్ సినిమా ఉందా? లేదా? అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.




ఒక హత్య సన్నివేశంతో ప్రారంభమైన ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ గతంలో జరిగిన సంఘటన గుర్తు తలుచుకుంటూ ఓ బాధాకరమైన ఒత్తిడి గల పోలీసు అధికారిగా ఇంట్రడక్షన్ ఇస్తాడు. దీనికి కారణం అతని గర్ల్ ఫ్రెండ్ మిస్సింగ్ కేస్ తనకి అప్పగించ పోవడమే. ఐతే తర్వాత ఒక అమ్మాయి తప్పి పోవడంతో రెండు మిస్సింగ్ కేసులను తనకే అప్పగించగా, అతడు ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభిస్తాడు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ అంతా చాలా సస్పెన్స్ గా, మస్త్ ఇంటరెస్టింగుగా ఉంటుందట. కానీ క్లైమాక్స్ వరకు ఇన్వెస్టిగేషన్ కొనసాగటం, క్లైమాక్స్ మాత్రం అంతంత మాత్రమే ఉండటం నచ్చలేదని నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

 

 

మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వెంట్రుకలు నిక్క పొడిచే లాగా, వెన్నులో వణుకు పుట్టేలా గా ఉంటుందట. అతని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ వలనే చాలా సీన్లు బాగా అలరించాయి అని తెలుస్తుంది. అలాగే, విశ్వక్ సేన్ తన పాత్రకు 100% న్యాయం చేశాడు. అతని డైలాగ్ డెలివరీ సూపర్ గా ఉందని ప్రేక్షకులు తెలుపుతున్నారు. ఈ సినిమాలో నటించిన రుహాణి శర్మ పాత్ర చాలా చిన్నదని, గ్లామరస్ గా కనిపించలేదు కానీ ఇతర పాత్రల్లో నటించిన హరితేజ కాస్త ఎంటర్ టైన్ చేస్తుంది.




ఇకపోతే డైరెక్టర్ శైలేష్ కొలను థ్రిల్లర్ సినిమా చేయాలనే ఆశతో హిట్ ని తెరకెక్కించాడు కానీ అందులో అసలైన థ్రిల్లింగ్ సన్నివేశాలు అంతగా బాగోలేదు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్లైమాక్స్ బాగా లేకపోయినా పర్లేదు కానీ థ్రిల్లర్ సినిమా చూడాలని మీరు అనుకుంటే... ఈ సినిమాని ఒక్కసారి మీరు చూడవచ్చు. మా రేటింగ్ 2.75.

మరింత సమాచారం తెలుసుకోండి: