టాలీవుడ్ లో ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు గా వచ్చారు.  పవన్ కళ్యాన్ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ లో తమ సత్తా చాటుతూ వచ్చారు.  మెగా హీరోలు ఎలా ఉండాలని కోరుకుంటారు అంతకు మించి అనేలా వారి నటన, డ్యాన్స్, ఫైట్స్ తో మెప్పిస్తున్నారు.  ఇక పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు.  ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్ తో మరో ఘన విజయం అందుకున్నాడు.  ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్ సినిమాత తర్వాత వరుగా ఆరు సినిమాలు ఫెయిల్ అయ్యాయి.

 

 ఒదకశలో ఇక కెరీర్ ముగింపు అవుతుందా అన్న పరిస్థితిలో ‘చిత్రలహరి’ తో మరో మంచి విజయం అందుకున్నాడు.  ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతిరోజూ పండుగే’ తో మరో సక్సెస్ అందుకున్నాడు.  ఇలా వరుసగా రెండు సినిమాలు హిట్ కావడంతో మంచి జోష్ లో ఉన్న సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం  'సోలో బ్రతుకే సో బెటర్` సినిమా చేస్తున్నాడు. మే 1న ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ రిలీజ్ కానుంది. ఈ లోపే తేజ్ ఓ పిరియాడిక్ ఫిల్మ్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు.

 

'బిందాస్', 'రగడ' మూవీస్ దర్శకుడు వీరు పోట్ల రూపొందించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీని అనిల్ సుంకర నిర్మిస్తాడని టాక్.  అయితే ఈ మూవీ శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండబోతుందని టాలీవుడ్ టాక్.  ప్రస్తుతం స్టార్ హీలు ఈ టైప్ పిరియాడికల్ మూవీస్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: