చిరంజీవి గా ప్రసిద్ధి చెందిన కొణిదెల శివశంకర వరప్రసాద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడీయ‌న‌. క్లారిటీ చెప్పాలంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ.రామారావు తరువాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి. మ‌రియు ఈయ‌న ఎంతో ఓర్పుగా ఉంటార‌న్న‌ది అంద‌రికీ తెలుసు. ఎప్పుడో గాని ఈయ‌న కోపాన్ని చూడ‌లేము. ఎందుకంటే అంత స‌హ‌నంగా ఉంటారు. అలాంటి చిరంజీవి గ‌తంలో ఓ డైరెక్ట‌ర్ చెంప పేల‌గొట్టిన‌ట్టు ఇండ‌స్ట్రీలో పుకార్లు షికార్లు కొట్టాయి.

 

అయితే వాస్త‌వానికి రామ్ చరణ్ కెరీర్ కోసం ఎప్పుడూ చిరంజీవి కూడా తాపత్రయపడుతూనే ఉంటాడు. ఆయన రాజకీయాల్లో ఉన్నపుడు కూడా చరణ్ చేసే ప్రతీ సినిమా కథను ముందు చిరు విన్న తర్వాతే సెట్స్‌పైకి వచ్చేది. రామ్ చరణ్ కెరీర్ సక్సెస్ కావడంలో చిరంజీవి పాత్ర కూడా మరవలేనిది. అడుగడుగునా తనయుడి కెరీర్‌కు పూలబాటలు వేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు మెగాస్టార్. ఇక కొణిదెల వారసుడు, చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. సినిమా రంగంలో ప్రత్యేకత చాటుకుంటున్నారు. 

 

నటుడిగా కెరీర్ కొనసాగిస్తూనే నిర్మాణ రంగంలోనూ సత్తా చాటుతున్నారు. ఓ వైపు నటన, మరోవైపు నిర్మాణం రెండింటా రాణిస్తున్నారు. అయితే రామ్ చ‌ర‌ణ్ కెరీర్ స్టాటింగ్‌లో చిరుత, మ‌గ‌ధీర చిత్రాలు మంచి విజ‌యాన్ని తెచ్చిపెట్టాయి. ఈ సినిమాల‌తోనే తిరుగులేని హీరోగా గుర్తుంపు తెచ్చుకున్నాడు చ‌ర‌ణ్‌. ముఖ్యంగా మ‌గ‌ధీర దెబ్బ‌కు టాలీవుడ్‌లో స్టార్ హీరోల చెంత చేరాడు. అయితే ఈ సినిమాల త‌ర్వాత ఓ ఫ్లాప్ సినిమా వ‌చ్చింది. ఈ సినిమాకు ఓవ‌ర్ బ‌డ్జెట్ పెట్టించి, విదేశాల్లో షూటింగ్ చేయించి భారీగా ముంచేశారు.

 

చివ‌ర‌కు ఈ చిత్రం అట్ట‌ర్ ప్లాప్ అవ్వ‌డంతో ప్ర‌తి ఒక్క‌రూ భారీగా న‌ష్ట‌పోయారు. ఈ చిత్రం నష్టాల వల్ల ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా చేసారట ఒక‌రు. ఈ నేప‌థ్యంలోనే చిరంజీవి స‌ద‌రు డైరెక్ట‌ర్‌పై తీవ్రంగా సీరియ‌స్ అవ్వ‌డంతో పాటు చెంప చెళ్లుమ‌నిపించార‌ని అప్పట్లో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇది ఎంత వ‌ర‌కూ వాస్త‌వం అనేది బ‌య‌ట‌కు రాలేదుగానీ.. అప్ప‌ట్లో ఇది బాగా హాట్ టాపిక్ అయింది.


 


  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: