తెలుగు లో సీతాకోక చిలుక చిత్రంతో బాల నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయిన నటుడు అలీ.  బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న అలీ తర్వాత స్టార్ కమెడియన్ గా ఎదిగారు. ఒక్కో మెట్టు ఎదుగుతూ.. ప్రస్తుతం స్టార్ కమెడియన్ గానే కాదు.. పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చాడు.   కమెడియన్ గా కొనసాగుతూనే  కొన్ని చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు అలీ. కృష్ణారెడ్డి దర్శకత్వంలో యమలీల చిత్రంతో హీరోగా మారిన అలీ పలు చిత్రాల్లో హీరోగా కనిపించాడు.  హీరోగా మారిన తర్వాత కూడా తన కామెడీ పాత్రలకు గుడ్ బాయ్ చెప్పకుండా కమెడియన్ గా కూడా నటిస్తూ వచ్చాడు. ప్రస్తుతం అలీ వెండితెరపైనే కాదు బుల్లి తెరపై కూడా తన సత్తా కొనసాగిస్తున్నారు.  పలు ఇండస్ట్రీ ఈవెంట్స్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 

 

గతంలో అలీపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. తన వ్యాఖ్యానంలో సహ యాంకర్లను ద్వందర్థాలతో మాట్లాడుతారని కామెంట్స్ వినిపించాయి.  తాజాగా అలీ బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.  ఈ సందర్భంగా పలువురు సెలబ్రెటీలను ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవి శంకర్ ని ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ సోదరుడు రవి శంకర్.  ఆయన కూడా చిన్నతనంలోనే నటుడిగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  ప్రస్తుతం కన్నడంలో బిజీ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు.  ఆ మద్య అరుంధతి చిత్రంలో ఓసేయ్ అరుంధతి నీకు పెళ్లా అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో బాగా పాపులర్ అయ్యాడు రవి శంకర్. 

 

తాజాగా తన జీవితంలో జరిగిన సంఘటనలు గురించి మాట్లాడారు.  బయట అందరినీ భయపెట్టించే విలన్ గా నటిస్తావు.. మరి ఇంట్లో మీ ఆవిడను భయపెడతావా.. లేదా నువే భయపడతావా... అన్న ప్రశ్నకు నో తనే నన్ను భయపెడుతుంది.. మనం ఇంట్లో ఆడవారికి భయపడాల్సిందే అంటూ అలీని కూడా కలిపాడు.  ఇక తన అన్నా, వొదిన దేవుళ్లు అన్నారు.  తన తల్లి డైరీకి తనకు ఉన్న సంబందం గురించి మాట్లాడుతూ.. నీ పుట్టుక నీకు అనవసరం.. కానీ నీ చావు ప్రపంచానికి తెలిసేంత గొప్ప పొజీషన్ లో నువు ఉండాలని కోరుకునేది మా అమ్మ.. అమ్మ గొప్పతనం గురించి విన్న అలీ ఒక్కసారే ఎమోషన్ అయి కన్నీరు పెట్టుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: