ఈ మద్య చాలా మంది హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఎంత స్కిన్ షో చేస్తే అంత సక్సెస్ అన్నరీతిలో కొనసాగుతున్నారు.  ఈ క్రమంలో సీనియర్ నటీమణులు యూటర్న్ తీసుకుంటూ నటనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కొంత మందికి గ్లామర్ పాత్రలు మొదట్లో కలిసి వచ్చినా.. ఫెడవుట్ అయ్యాక వారి ముఖం కూడా చూడరు.  ఇలా ఎంతో మంది హీరోయిన్ కంటికి కనిపించకుండా పోయారు.  ఇక సింగర్ గా  కెరీర్ ప్రారంభించిన ఆండ్రియా హీరోయిన్ రాణిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరోల సరసన భారీ మూవీస్ నటించి తనదైన అందచందాలతో మైమరిపిస్తోంది.  లిప్ లాక్ , బెడ్ రూమ్ సీన్లలో ఆండ్రియా రెచ్చిపోయి నటించింది.  

 

తాజాగా తాను బెడ్ రూమ్ సీన్లలో సరసంగా నటించి చాలా తప్పు చేశానని, ఇప్పుడు తనకు అటువంటి పాత్రలే అధికంగా వస్తున్నాయని నటి ఆండ్రియా వాపోతోంది. ఆమె నటించిన తాజా మూవీ 'వడ చెన్నై'లో కొన్ని సీన్లలో ఆమె నగ్నంగా కనిపించింది.  అయితే ఈ విషయంపై కోలీవుడ్ లో పెద్ద వివాదం చెలరేగింది. దాంతో అలాంటి బూతు సీన్లు సెన్సార్ చేశారు.  కానీ అవి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ పడక సీన్ చేయడం తన పొరపాటై పోయిందని ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆండ్రియా.  యూట్యూబ్- ఇన్ స్టాగ్రమ్ లోనూ జోరుగా వైరల్ అయింది. ఇప్పటికీ ఆండ్రియా రొమాంటిక్ సీన్స్ గూగూల్ సెర్చ్ లో ట్రెండింగు లో ఉన్నాయి.

 

దర్శక నిర్మాతలు ఇప్పటికీ నా నుంచి అలాంటి సన్నివేశాల్ని కోరుకుంటున్నారు. ఆ విషయం లో ఆవేదన గాను.. బాధ గాను ఉంది అంటూ వాపోయింది. మంచి స్టోరీ తన ముందుకు వస్తే, తీసుకునే పారితోషికాన్ని తగ్గించుకునేందుకు సమ్మతమేనని అంటోంది. కాగా, కార్తితో 'ఆయిరత్తిల్ ఒరువన్', కమల్ హాసన్ తో 'విశ్వరూపం', అజిత్ తో 'మంగాత్త' తదితర హిట్ సినిమాల్లో నటించింది.  ప్రస్తుతం ఈ బ్యూటీ  'మాళిగై', 'మాస్టర్', 'అరణ్మనై-3' మూవీస్ లో నటిస్తూ బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: