వరుస పరాజయాల తరువాత ఇటీవల భీష్మ తో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు యంగ్ హీరో నితిన్. ఈనెల 21న విడుదలైన ఈచిత్రం 7రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా  23.43 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టి అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను  చేరుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం వారం రోజుల్లో 18.91 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో ఫుల్ రన్ లో 30కోట్ల మార్క్ ను టచ్ చేసేలానే ఉంది. సినిమా విజయం సాధించడంతో మేకర్స్ రేపు వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రం లో విజయోత్సవ సభను నిర్వహించనున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ ఈ వేడుక కు ముఖ్య అతిథి గా రానున్నాడు. 
 
భీష్మ మొదటి వారం వసూళ్ల వివరాలు : 
 
నైజాం - 7.59 కోట్లు 
సీడెడ్ - 2.88 కోట్లు 
ఉత్తరాంద్ర - 2.55 కోట్లు 
గుంటూరు - 1.51 కోట్లు 
తూర్పు గోదావరి - 1.45 కోట్లు 
పశ్చిమ గోదావరి - 0.17 కోట్లు '
కృష్ణా - 1.16 కోట్లు 
నెల్లూరు - 0.60 కోట్లు 
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఏడు రోజుల షేర్ = 18.91 కోట్లు 
రెస్ట్ అఫ్ ఇండియా - 1.8 కోట్లు
ఓవర్సీస్ - 2.72 కోట్లు
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా వారం రోజులకు గాను షేర్ - 23.43 కోట్లు 

మరింత సమాచారం తెలుసుకోండి: