ఈ మద్య వస్తున్న చిత్రాలు థియేటర్లో రిలీజ్ అవుతున్న ముందు ఎన్నో ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి.  ప్రమోషన్ కి ముందు చిత్ర యూనిట్ ఏ చిన్న కామెంట్స్ చేసిన ఆ ప్రభావం రిలీజ్ అవుతున్న చిత్రాలపై ఉంటున్నాయి.  తాాజాగా తాప్సీ పొన్ను నటించిన ‘తప్పడ్’ మూవీపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. తప్పడ్‌' ఈ రోజు విడుదలైన నేపథ్యంలో 'బాయ్‌కాట్‌ తప్పడ్‌' అనే హ్యాష్‌ట్యాగ్‌లో నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. అయితే దీనికి కారణం ఇటీవల  పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన తెలుపుతున్న వారికి ఆమె మద్దతు తెలపడంతో ఆమెకు ఇటువంటి పరిస్థితి ఎదురవుతోంది.

 

ప్రస్తుతం ఢిల్లీలో ఎంత దారుణంగా అల్లర్లు కొనసాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇప్పటికే దాదాపు నలభై మంది చనిపోయారు.  ఓ వైపు అక్కడ హింసాకాండ కొనసాగుతుంది.  తాజాగా ఈ విషయంపై తాప్సీ స్పందించి మాట్లాడింది.. నటుల వ్యక్తిగత అభిప్రాయాల ప్రభావం చిత్రాలపై పడదని నేను భావిస్తున్నాను. బాయ్‌కాట్‌ తప్పడ్‌ ప్రభావం కూడా ఈ చిత్రంపై పడదని అనుకుంటున్నాను.  ఇప్పటికీ వెయ్యికి పైగా పోస్ట్ లు వచ్చాయి.. ఈ పోస్టులు నిజంగానే సినిమాపై ప్రభావం చూపెడుతాయా? చూపెడుతాయని నేను మాత్రం అనుకోవట్లేదు' అని తెలిపింది.

 

నటుల వ్యక్తిగత అభిప్రాయాల కారణంగా వారి చిత్రాలు చూడాలా? వద్దా? అన్న విషయంపై నిర్ణయాలు తీసుకోవడం తెలివితక్కువ తనమే అవుతుంది'  అని తాప్సి చెప్పింది. నాకు తెలిసినంత వరకు ఇంస్ట్రీలో ఇలాంటివి కామన్ ఇలాంటి ప్రభావాలు చిత్రాలపై ఉండవు అన్నారు. వ్యక్తిగతంగా సామాజిక, రాజకీయ అంశాల పట్ల చాలా మంది ప్రజల కంటే విభిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు అన్నారు.   ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగుతున్న సీఏఏపై ఆమె తెలిపిన అభిప్రాయం పట్ల కూడా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీలో అల్లర్ల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. ఇలాంటి సమయంలో తన చిత్రం గురించి ప్రమోషన్ చేయడం ఎంత వరకు న్యాయం అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: