సినీ ఇండ‌స్ట్రీలో హీరో, హీరోయిన్ల‌ మ‌ధ్య ఎఫైర్లు ఉండ‌డం కామ‌న్ అయిపోయింది. అయితే చాలామందికి ఎఫైర్లు ఉన్నా లేక‌పోయినా విస్తృతంగా పెరిగిపోయిన మీడియా ఎఫెక్ట్‌తో ఎవ‌రో ఒక‌రితో లింక్‌లు పెట్టి గాసిప్‌లు పుట్టుస్తుంటారు. కానీ, కొంద‌రు మాత్రం సీరియ‌స్‌గానే రిలేష‌న్ షిప్ కంటిన్యూ చేస్తుంటారు. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. ఆ హీరోకు క‌న్నె పిల్ల‌లే కావాలా.. నా భ‌ర్త మంచోడంటూ పెళ్లాం స‌మ‌ర్థ‌న. టాలీవుడ్‌లో ఆయ‌నో ఆగ్ర హీరో. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఓ యాక్ష‌న్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

 

ఈ క్ర‌మంలోనే ఎన్నో సినిమాలు చేసి హిట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా ఈయ‌న పోషించిన పోలీసు పాత్ర నిజజీవితంలో కొంతమంది పోలీసులను కూడా ప్రభావితం చేసింది. అలాంటి హీరో ఒకానొక టైమ్‌లో హిట్టే లేక స‌త‌మ‌త‌మ‌య్యాడు. ఇక అప్ప‌ట్లోనే త‌న తోటి హీరోయిన్‌ను ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నాడీయ‌న‌. పెళ్లి త‌ర్వాత కూడా దాదాపు పదేళ్లపాటు సరైన హిట్ అందుకోలేక‌పోయాడు. ఒక దశలో సినిమాలో సరిగా ఆడక స్వంత ఇల్లు కూడా అమ్ముకోవలసి వచ్చింది. అయితే ఇటీవ‌ల వ‌చ్చిన ఈయ‌న సినిమా ఓ మోస్త‌రు హిట్ కొట్టి మ‌ళ్లీ నిల‌దొక్కుకున్నాడు.

 

ఈ క్ర‌మంలోనే స‌ద‌రు హీరో ఎఫైర్ల‌పై అనేక ర‌కాలుగా పుకార్లు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా ఓ సామాజిక కార్యకర్త స‌ద‌రు హీరోకు క‌న్నె పిల్ల‌లే కావాలి అంటూ వ్యాఖ్య‌లు చేసింది. ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది ప‌క్క‌న పెడితే.. అప్ప‌ట్లో ఇది బాగా హాట్ టాపిక్ అయింది. దాంతో ఈ వ్యాఖ్య‌లు సినీ, మీడియా వర్గాల్లోనూ దుమారం రేపాయి. అయితే అప్పుడు వాటిపై స‌ద‌రు హీరో భార్య స్పందించింది. తానొక మహిళను అని మరిచిపోయిన ఓ నాయకురాలు ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయ‌డం స‌రికాద‌ని స‌ద‌రు హీరో భార్య సామాజిక కార్యకర్తపై విరుచుకుప‌డింది. ఇలా చాలా మంది భ‌ర్త‌పై ఆరోప‌ణ‌లు చేస్తుంటే భార్య మాత్రం త‌న భ‌ర్త మంచోడంటూ స‌పోర్ట్‌గా నిలిచింది.

 

 


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: