భారతీయ చలన చిత్ర రంగంలో ఇప్పటి వరకు ఎంతో మంది తమ విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు.  అలాంటి వారిలో ప్రకాశ్ రాజ్ ఒకరు.  బుల్లితెరపై కెరీర్ ఆరంభించిన ఆయన అనూహ్యంగా నటుడిగా మారారు.  ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించారు.  కొన్ని చిత్రాల్లో హీరోగా కూడా నటించారు. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో నటించిన ప్రకాశ్‌రాజ్‌ నిర్మాత, దర్శకుడుగానూ మారిన సంగతి తెలిసిందే.    ప్రస్తుతం తండ్రి, మామ, తాత పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు.  ఇటీవల కాలంలో ఆయన రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు.  గత కొంత కాలంగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు ప్రకాశ్ రాజ్.  ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీపైనే అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు.  తాజాగా ప్రకాశ్ రాజ్ పై చెక్‌బౌన్స్ కేసులో సమన్లు జారీ అయ్యాయి.

 

ఆయన నిర్మించిన న‌డిగ‌ర్ అనే తమిళ చిత్రం కోసం ఓ బాలీవుడ్‌ ఫైనాన్సియర్‌ వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఇటీవల ఆయనకు ప్రకాశ్‌ రాజ్‌ చెక్ ఇచ్చారు.  అప్పట్లో తమిళ్‌లో ‘ధోని’, ‘ఉన్‌ సమయల్‌ అరైయిల్‌’ (తెలుగులో ఉలవచారు బిర్యాని), కన్నడలో ‘ఇదొళ్లె రామాయణ’ (తెలుగులో మనఊరి రామాయణం) వంటి చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించారు. ఓ వైపు చిత్రాలు, రాజకీయాల్లో బిజీగా ఉంటూనే స్వియ దర్శకత్వంలో చిత్రాలు నిర్మిస్తున్నారు. 

 

కాగా ప్రకాశ్‌రాజ్‌  ‘ఉన్‌ సమయల్‌ అరైయిల్‌’ (తెలుగులో ఉలవచారు బిర్యాని) మూవీని హిందీలో రీమేక్‌ చేయడానికి బాలీవుడ్‌ ఫైనాన్సియర్‌ ఒకరి వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకుని, అందుకుగానూ ఫైనాన్సియర్‌కు చెక్కును ఇచ్చారు. అది కాస్తా బ్యాంకులో బౌన్స్‌ అయ్యింది. దాంతో కొంత కాలం ఈ విషయంపై ప్రకాశ్ రాజ్ తో చర్చలు జరిపారు సదరు ఫైనాన్సియర్.  కానీ దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వక పోవడంతో ప్రకాశ్‌రాజ్‌పై మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన న్యాయమూర్తి  ఏప్రిల్‌ 2వ తేదీలోగా కోర్టుకు హాజరవ్వాలని నటుడు ప్రకాశ్‌రాజ్‌కు సమన్లు జారీ చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: