సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార మెట్టు దిగింది. లాస్ట్ టైమ్ డోంట్ కేర్ అని చెప్పిన నయన్ ఈ సారి మాత్రం సౌత్ సూపర్ స్టార్ కోసం కాంప్రమయిజ్ అయ్యిందట. నయన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మేకర్స్ అగ్రిమెంట్స్ కంప్లీట్ చేసి ఊపిరి పీల్చుకున్నారట. ఇంతకీ ఏ విషయంలో నయనతార దిగొచ్చిందో తెలుసా.. !


35ఏళ్లు క్రాస్ చేసిన నయనతార ఇప్పటికీ మెయిన్ హీరోయిన్ హవా సాగిస్తోంది. ఈ బ్యూటీ ఏజ్ ని పట్టించుకోకుండా విజయ్, రజినీకాంత్. అజిత్ లాంటి హీరోలు నయనతారను తమ సినిమాల్లో రిపీట్ చేస్తున్నారు. ఏజ్ పెరిగేకొద్దీ అందరి హీరోయిన్స్ కి గ్లామర్ తగ్గుతుంటే ఈ బ్యూటీకి మాత్రం రివర్స్ లో గ్లామర్ పెరుగుతుందేమో అనిపిస్తోంది. అంతేకాదు సినిమా సినిమాకు డిమాండ్ కూడా పెరిగిపోతోంది. 


నయనతార ఒక్కో సినిమాకు 5.5కోట్లు ఛార్జ్ చేస్తుంది. రూపాయి తగ్గినా మొహమాటం లేకుండా నో అంటుంది. నిర్మాతల ముక్కు పిండి మరీ వసూలు చేస్తుంది. అది కూడా సినిమా సరిపోయేంత కాల్షీట్లు మాత్రమే ఇస్తుంది. ఎక్స్ ట్రాగా ఒక్కరోజు కూడా ఇవ్వదు. ఇక సినిమా  ప్రచారానికి అమ్మడు దూరమనే విషయం తెలిసిందే. ఎయితే ఎప్పుడూ పంతం నెగ్గించుకునే ఈ బ్యూటీ సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం ఓ మెట్టు దిగొచ్చిందని తెలుస్తోంది. 

 

నయనతార ఈ ఏడాది దర్బార్ సినిమా కోసం రజినీకాంత్ తో మరోసారి జోడీ కట్టింది. నిజానికి ఈ సినిమాలో నయన్ పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదు. అయినప్పటికీ అక్షరాలా 5.5కోట్లు తీసుకుంది. కానీ ఇప్పుడు రజినీకాంత్ మీదున్న గౌరవంతో నయన్ ఓ కోటి రూపాయలు తగ్గించుకున్నట్టు టాక్. శివ దర్శకత్వంలో రజినీకాంత్ అన్నాతై అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసమే నయన్ కోటి తగ్గించిందట. వెంటవెంటనే రజినీకాంత్ ఛాన్స్ ఇవ్వడంతో నయన్ కణికరించినట్టు టాక్. ఈ సినిమా తెలుగులో అన్నయ్య టైటిల్ తో రిలీజ్ కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: