ఈ మధ్య కాలంలో కొత్త తరహాలో సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాలలో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వగా మరి కొన్నీ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాలలో ఎక్కువగా బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు తెరమీదకు దర్శనమిస్తున్నాయి. యువత కూడా ఆ సినిమాపై ఆసక్తి చూపడంతో ఆ సినిమాలు కూడా రచ్చ చేస్తున్నాయి. 

 


కాగా, ఇటీవల కాలంలో రొమాన్స్ కు ప్రాధాన్యం ఇస్తూ చాలా సినిమాలు వస్తుండటంతో దర్శక నిర్మాతలు కొంచం రూటు మార్చారు. హార్రర్, సస్పెన్స్ కథ ఉన్న సినిమాలను తెరకెక్కించే పనిలో పడ్డారు. మరి కొందరేమో సిఐడి స్టయిల్లో సినిమాలను రూపొందిస్తున్నారు. కాగా, ఇటీవల ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకున్న సినిమా 'రాహు'.. ఈ సినిమా హర్రర్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 


యువ నటులు అభిరామ్‌ వర్మ, కృతి గార్గ్‌ జంటగా నటిస్తున్నఈ సినిమాకు సుబ్బు వేదుల దర్శకత్వం వహించగా, శ్రీశక్తి బాబ్జీ, రాజా దేవరకొండ నిర్మాతలు.చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో హీరోయిన్ పాత్ర కొంచెం కొత్తగా సాగుతుంది.. రక్తం చూస్తే ఆమె కళ్ళు కనిపించవు అనే నేపథ్యంలో సినిమా రూపొందింది. 

 


ఇవాళ విడుదల అయినా ఈ సినిమా కథ అర్థం కాలేదన్న మాటలను సొంతం చేసుకుంది. కాగా, అంతేకాకూండా సినిమా ఫస్ట్ ఆఫ్ ఒకలా ఉన్న సెకండాఫ్ బాగోలేదన్న మాటలను అందుకుంటుందని సినిమా చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి సినిమా ఓ మాదిరిగా పర్వాలేదని అనిపిస్తుందని టాక్. అయితే ఈ మధ్య వస్తున్నా సినిమాలు ఏవి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోక పోవడంతో మొదటి షో కె దుకాణ్ సర్దేస్తున్నాయని సినీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: