టాలీవుడ్ లో ప్రభాస్ నటించిన సాహో సినిమా హిట్ ఫ్లాప్ సంగతి పక్కన పెడితే బాహుబలి సినిమా తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి ఆ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. భారీ బడ్జెట్ తో వచ్చిన చిత్రం కాబట్టి ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. పాన్ ఇండియా రిలీజ్ కావడంతో సినిమా వసూళ్లు భారీగా వచ్చాయి. దాదాపు 400 కోట్ల వసూళ్లను ఈ సినిమా సాధించించి రికార్డులు సృష్టించింది. ప్రభాస్ కెరీర్ లో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గా ఈ సినిమా నిలిచింది అనేది వాస్తవం. 

 

ఇది పక్కన పెడితే ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత త్రయం శంకర్-ఎహ్‌షాన్-లాయ్ సంగీతం అందించేందుకు తొలుత ముందుకి వచ్చారు. మరి ఏమైందో ఏమో తెలియదు గాని ఆ తరం మధ్యలోనే ఈ చిత్రం నుంచి పని చేయకుండా బయటకు వెళ్ళింది. ఉన్నట్టుండి అనూహ్యంగా సోషల్ మీడియాలో ఒక షాక్ ఇచ్చారు. ప్రభాస్ `సాహో` సినిమాకు సంగీతం అందించలేమని సోషల్ మీడియా ద్వారా ఆ తరం వెల్లడించి షాక్ ఇచ్చింది. తాజాగా ఆ సినిమా నుంచి బయటకు రావడానికి గల కారణాన్ని త్రయంలో ఒకరైన శంకర్ మహదేవన్ తాజాగా మీడియాకు వెల్లడించారు. 

 

ఆ సినిమాకు చెందిన మ్యూజిక్ కంపెనీ మాతోపాటు వేరే సంగీత దర్శకుల చేత కూడా కొన్ని పాటలు చేయించాలనుకుందని చెప్పారు. ఈ రోజుల్లో ఇలాంటివి సాధారణంగా మారిపోయాయన్న ఆయన... అయితే మేం ఆ ప్రపోజల్‌కు `నో` చెప్పామన్నారు. తమకు అలా చేయడం సౌకర్యవంతంగా అనిపించలేదని ఆయన వెల్లడించారు. ఒక సినిమాకు సంబంధించిన పాటలన్నింటినీ మేమే చేయాలని అనుకుంటామన్నారు. అందుకే `సాహో` నుంచి బయటకు వచ్చామ`ని శంకర్ పేర్కొన్నారు. కాగా ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: