మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు చిత్ర పరిశ్రమ... తెలుగు చిత్ర పరిశ్రమ అంటే మెగాస్టార్ చిరంజీవి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్దన్నగా  కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. కొన్ని రోజులపాటు తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైనప్పటికీ  ఆ తర్వాత ఖైదీనెంబర్150 సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. తనకు తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజ్ ఎక్కడా తగ్గలేదు అంటూ నిరూపించాడు. ఇక ఆ తర్వాత తన సినీ కెరీర్ లోనే మొట్టమొదటి చారిత్రాత్మక సినిమాగా తెరకెక్కిన  సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి  విజయాన్ని అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక మెగాస్టార్ చిరంజీవి ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే దానిపై అభిమానులందరి ఆసక్తి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 

 

 

 ఇక కొరటాల శివ సినిమాలు అంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలే ఉంటాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది వైరల్ గా మారిపోతుంది. ప్రస్తుతం తాజాగా మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాకి సంబంధించి మరో వార్త ఇప్పుడు చెక్కర్లు కొడుతుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సెక్సీ విలన్ కీలక పాత్రలో నటించబోతున్నాడు అని సమాచారం. తన సిక్స్ ప్యాక్ తో ఎంతో మంది మగువల మనసులు దోచుకున్న నటుడు బాలీవుడ్లో ఎంతో క్రేజ్ సంపాదించుకొని వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నా సోనూసూద్ ని మెగాస్టార్ సినిమాలో ఓ కీలక పాత్రలో  కనిపించబోతున్నాడట. 

 

 

 అయితే మెగా స్టార్ సినిమాలు సోనుసూద్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారని  తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించి సోను సూద్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను అంటూ సోనూసుద్  తెలిపాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమ తనను అక్కున చేర్చుకుంటుంది అంటున్నారు సోనూసూద్ . దక్షిణాది ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమను ఈ సినిమాతో ఎంతోకొంత తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సోనుసూద్ తమిళ సినిమాల్లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: