తెలుగు లో విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు చాలా కాలం విరామం తర్వాత సూర్య నటిస్తున్న ‘ఆకాశమే నీ హద్దురా’  మూవీలో కనిపిస్తున్నారు. తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘సూరరై పోట్రు’ తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాలో విలక్షణ నటుడు మోహన్‌బాబు ముఖ్యపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుధా కొంగర, సూర్య కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం ఆకాశమే నీ హద్దురా. ఆ మద్య ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇందులో జేబులో 6 వేలు పెట్టుకుని విమానం కంపెనీ పెడతామని ఒకడొస్తే.. ఎవడ్రా ఈ వీపీ గాడని ఈ లోకం వాడిని చూసి నవ్వింది అంటూ డైలాగ్‌ కింగ్‌ మోహన్‌ బాబు చెప్పే డైలాగ్స్‌తో షురూ అయ్యే ట్రైలర్‌ బాగా ఆకట్టుకుంది.

 

తాజాగా ఈ మూవీ నుంచి మంచు మోహన్ బాబు లుక్ రిలీజ్ చేశారు.  తన పాత్రకు తెలుగుతోపాటు, తమిళంలోనూ మోహన్‌బాబే డబ్బింగ్‌ చెప్పుకోవడం మరోవిశేషం.  చిత్రంలో తన పాత్రకు సంబంధించిన లుక్ ను మోహన్ బాబు ట్విట్టర్ లో పంచుకున్నారు.  ఈ ట్విటర్‌లో పోస్ట్‌  మంచు లక్ష్మీ స్పందించారు.   ‘ఓహ్‌ నాన్న తన పుట్టిన పేరును సినిమాలో ఉపయోగించారని నాకు తెలియదు. యూనిఫామ్‌లో నాన్న ఎంత అందంగా ఉన్నాడో. మా నాన్న ఓ అద్భుతం.’’ అంటూ ట్వీట్‌ చేశారు.

 

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ తమిళ్, తెలుగులో త్వరలో విడుదల కానుంది.  ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ను సన్ నెట్ వర్క్స్ భారీ ధర పెట్టి కొనుగోలు చేసి దక్కించుకున్నట్లు సమాచారం. సూర్య ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తోంది. కాలీ వెంకట్, ప్రతాప్ పోతన్, కారుణాస్, వివేక్ ప్రసన్న, పరేశ్ రావల్, కృష్ణ కుమారి తదితరులు నటిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: