తమిళ నటుడు సూర్య, మన తెలుగు వారికి కూడా ఎంతో సుపరిచితం. గతంలో ఆయన నటించిన గజినీ, సెవెంత్ సెన్స్, వీడోక్కడే, సింగం, 24, తో పాటు మరికొన్ని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఇక కోలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రయోగాలు చేయడంలో అందరికంటే ఒకడుగు ముందు నిలిచే సూర్య, తనకు ఇటీవల పెద్దగా సక్సెస్ లు రానప్పటికీ కూడా తన సినిమాల ఎంపిక శైలిని మాత్రం మార్చనని అంటున్నారు. 

 

ఇక ఎప్పుడూ సరికొత్త పంథా కథలను, కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగె సూర్య, ప్రస్తుతం లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 'ఆకాశం నీహద్దురా'. ప్రముఖ విమానయాన సంస్థ అయిన ఎయిర్ డెక్కన్ యొక్క అధినేత కెప్టెన్ గోపినాధ్ జీవితం ఆధారంగా ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. 2డి  ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తమిళ్ తో పాటు ఇటు తెలుగులో కూడా ఏక కాలంలో నిర్మితం అవుతున్న ఈ సినిమాలో భక్త వత్సలమ్ నాయుడు అనే పాత్రలో మంచు మోహన్ బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే నేడు ఆయన పాత్ర ఫస్ట్ లుక్ ని సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. 

 

సీనియర్ పైలెట్ లుక్ లో డాషింగ్ గా అదరగొట్టిన మోహన్ బాబు పై సూర్య కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఒక పోస్ట్ చేస్తూ ఆయన పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మా ఆకాశం నీ హద్దరా సినిమాలో లో తనదైన శైలితో మరపురాని మాస్ ఉరుములు మెరుపులు కురిపించి మమ్మల్ని మురిపించిన, మా మంచి మంచు భక్తవత్సల నాయుడు గారికి మా సెల్యూట్ అంటూ సూర్య పోస్ట్ చేయడం జరిగింది. తమిళ నటుడు అయినప్పటికీ, అందులోనూ ఒక స్టార్ హోదాలో ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా ఎంతో ఒదిగిపోయి మోహన్ బాబు గారి గురించి అందరి మైండ్ బ్లాక్ అయ్యేలా కామెంట్స్ చేసిన సూర్య పై అటు తమిళ తో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: