నాచురల్ స్టార్ నాని నిర్మాతగా సెకండ్ ప్రయత్నంగా చేసిన సినిమా హిట్. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమాను శైలేష్ డైరెక్ట్ చేశారు. చిలసౌ ఫేమ్ రుహాని శర్మ ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ గా నటించింది. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విక్రం పాత్రలో విశ్వక్ సేన్ అదరగొట్టాడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు శైలేష్ తన మొదటి సినిమా ఇది అంటే ఎవరు నమ్మరు.. అంత్ పర్ఫెక్ట్ గా సినిమా తీశాడు.    

 

ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో విక్రం పాత్రపై ఓ గన్ పేలుతుంది. సడెన్ గా హిట్ సెకండ్ కేస్ టైటిల్ పడుతుంది. అంటే హిట్ సీక్వల్ ఉండబోతుందన్నమాట. అందుకే హీరో గతం గురించి పదే పదే బాధపడుతుంటాడు. కాని సినిమా పూర్తయినా ఆ గతం గురించి మాత్రం చూపించరు. ఆ గతం గురించి తలచుకుంటూ హీరో ప్రతిసారి ఎమోషనల్ అయిపోతాడు. సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే నాని ఇంకా అతని టీం ఇలా చేస్తుందని అంటున్నారు. సినిమా తీయడం మాత్రమే మేకర్స్ వంతు అది ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అన్నది ప్రేక్షకుల ముందుకు వస్తేనే తెలుస్తుంది.  

 

అలాంటిది సినిమా ఆల్రెడీ హిట్ అవుతుందని ఊహించి పార్ట్ 2 తీయడం.. దానికోసం సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాలు చూపించకుండా దాచడం లాంటివి చూస్తే శైలేష్, నాని పెద్ద ప్లానే వేశారని అనిపిస్తుంది. సినిమాలో హీరో గతం గురించి చెప్పడు.. కాని ప్రతిసారి ఆ సంఘటన గురించి ఆలోచించుకుని డిప్రెషన్ లోకి వెళ్తాడు. ఇంతకీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి..? అసలు విక్రం పర్సనల్ లైఫ్ ఏంటి..? అన్నది హిట్ పార్ట్ 2లో చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: