కోలీవుడ్ లో ఇప్పుడు నయనతార టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఎంత అందమైన అమ్మాయిలు ఉన్నా సరే పాపకు ఒక రేంజ్ ఉండటంతో దర్శక నిర్మాతలు ఆమెను సినిమాల్లోకి తీసుకుంటున్నారు. ఆమె వరుస అవకాశాల తో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె పట్టిందల్లా అక్కడ బంగారమే అవుతుంది. ఆమె చేసిన సినిమాలు అన్నీ దాదాపుగా హిట్స్ ఉండటంతో దర్శక నిర్మాతలు ఆమె కోసం భారీ ఆఫర్లే ఇస్తున్నారు. ఇటీవల ఆమెకు అగ్ర దర్శకులతో నటించే ఆఫర్లు ఎక్కువగానే వస్తున్నాయి. దీనితో నయనతార రేటు కూడా భారీగా పెంచుతూ పోతుంది. 

 

తాజాగా విజయ్ సేతుపతి సహా పలువురు హీరోలతో ఆమె రొమాన్స్చేయడానికి రెడీ అయింది. దీనికి సంబంధించి సంతకాలు కూడా చేసింది నయనతార. ఈ నేపధ్యంలోనే ఆమెకు సంబంధించిన వార్త ఒకటి హల్చల్ చేస్తుంది. ఈ మధ్య రేటు ఎక్కువగా పెంచిన ఈ ముదురు హీరోయిన్ నిర్మాతలకు దర్శకులకు కొన్ని కండీషన్ లు పెట్టేసింది. వరుస అవకాశాల నేపధ్యంలో ఇంత అయితేనే చేస్తాను అంటూ చెప్పింది. దీనితో విజయ్ సేతుపతి సినిమా కోసం మరో స్టార్ హీరోయిన్ ని సంప్రదించారు నిర్మాతలు. 

 

వెంటనే ఏమనుకుందో తెలియదు గాని నాకు ఆ ప్రాజెక్ట్ లేకపోయినా పర్వాలేదు చేయను అని చెప్పేసింది. ఆ తర్వాత మరో సినిమా విషయంలో ఆమె పారితోషికం ఎక్కువగా ఉన్న నేపధ్యంలో దర్శకుడు కలిసి ఇంత అయితే కష్టం మేడం అని చెప్పాడట. దీనితో నయన్ నేను చేయలేను అని చెప్పింది. వెంటనే దర్శకుడు ఏమీ అనకుండా ఓకే అన్నాడు. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని గంట టైం లో ఖరారు చేసాడు. ఆ సినిమా షూటింగ్ కి కూడా వెళ్ళడానికి సిద్దమవుతుంది. దీనితో ఇప్పుడు ఆమె రూటు మార్చింది. ఎంత అయినా పర్వాలేదు. ఎంతో కొంత మీ ఇష్టం అని విజయ్ సేతుపతి సినిమా కోసం చెప్పడంతో సదరు దర్శకుడు ఈమె పేరు నోట్ చేసుకున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: