నటనలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్.. ఎప్పటికప్పుడు తమను తాము నటనలో మెరుగు పెట్టుకుంటేనే సినీ రంగంలో నిలదొక్కుకుంటారు. ఈ ప్రక్రియలో ఒక్కొక్కరు ఒక్కో స్టయిల్ లో ప్రాక్టీసు చేస్తుంటారు. నటుడు సాయి కుమార్ తమ్ముడు రవి శంకర్ వర్మ తెలుసు కదా.. ఇలా చెబితే వెంటనే గుర్తుపట్టలేరు. కానీ అమ్మ బొమ్మాళీ అంటూ ప్రేక్షకులను దడ పుట్టించిన బొమ్మాళీ రవి శంకర్ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు.

 

 

తెలుగులో పెద్దగా నటన అవకాశాలు ఇతనికి రాలేదు. కానీ డబ్బింగ్ తో మాత్రం కేక పుట్టించేస్తున్నాడు. ఈయన కన్నడలో గొప్ప విలన్ గా పేరు తెచ్చుకున్నారు. ఈయన్ను చూస్తేనే మహిళలు దడుచుకుంటారట. అలాంటి రవి శంకర్ వర్మకు ఓ వింత అలవాటు ఉందట. తాను నటన ప్రాక్టీస్ చేసిది ఎక్కడో తెలుసా.. బాత్ రూమ్‌ లో.. అవును ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

 

 

ఆయన బాత్ రూమ్‌కి వెళ్తే గంటలకు గంటలు అక్కడే ఉండిపోతాడట. అక్కడ ప్రాక్టీసు , పెర్ ఫార్మన్సెన్సూ చేసుకుని అప్పుడు బయటకు వస్తాడట. భలే వింతగా ఉంది కదూ. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అలీ బయటపెట్టాడు. అందుకే రవి శంకర్ వర్మ బెంగళూరులో కొత్తగా కట్టించుకున్న ఇంటిలో రెండు బెడ్రూములు ఉంటే.. బాత్ రూములు మాత్రం నాలుగో ఐదో ఉన్నాయంటూ అలీ సెటైర్ వేశాడు.

 

సాయి కుమార్ తమ్ముడైన ఈ రవిశంకర్ వర్మ కన్నడంలో మంచి విలన్ కదా.. ఓ డైలాగ్ చెప్పమంటే.. ఏకంగా సీమ కత్తి పట్టుకుని ఓ డైలాగ్ చేప్పేసరికి అలీ సైతం భయపడ్డారు.. ఇలాంటి ఎన్నో విషయాలు రవి శంకర్ వర్మ ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: