టాలీవుడ్ రెండుగా చీలిందా అన్న డౌట్లు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు రెండుగా ఇప్పటికే ఉన్నాయి. దాంతో సినీ పరిశ్రమ  కూడా తమ ప్రయోజనాల కోసం అటూ ఇటూ మొగ్గుతోందని అంటున్నారు. ఇక టీయార్ అధినేత కేసీయార్ విశాఖను రాజధానిగా జగన్ ప్రకటించాక జాగ్రత్త పడుతున్నారు. సహజ‌సిధ్ధమైన  అందాలతో అలరారుతున్న విశాఖ కనుక రాజధాని అయితే టాలీవుడ్ లో కొంతభాగమైనా అటు మళ్ళుతుందని తెలంగాణా సర్కార్ ఆలోచిస్తోందని, అందుకే సినీ ప్రముఖులను చేరదీస్తోందని అంటున్నారు.

 

ఆ విధంగా  ఈ మధ్య కేసీయార్ సర్కార్ మెగాస్టార్ చిరంజీవిని, మరో టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునని దగ్గరకు తీస్తోంది. వారితోనే మొత్తం సినీ పరిశ్రమ అంతా  ఉందన్న‌ట్లుగా బిల్డప్ ఇచ్చెలా భేటీలు జరుగుతున్నాయి. ఆ భేటీలకు మరో ప్రముఖుడు దగ్గుబాటి సురేష్ కి ఎటువంటి ఆహ్వానం రాలేదు. దీంతో ఆయన గుస్సా అయ్యారని ఇన్నర్ టాక్. 

 


దానికి పోటీ అన్నట్లుగా ఇపుడు హఠాత్తుగా సురేష్ ఇతర నిర్మాతలు జగన్ని కలిశారని అంటున్నారు. కేసీయార్ కూడా మెగాస్టార్ , నాగ్ లను జగన్ వైపు మళ్ళకుండా కట్టడి చేశారని ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపధ్యంలో దగ్గుబాటి ఫ్యామిలీ ఇపుడు జగన్ వైపు చూస్తోందని అంటున్నారు. అందుకే ఉన్నఫలంగా దగ్గుబాటి సురేష్, ఇతర పెద్దలు వచ్చి జగన్ని కలిశారని అంటున్నారు.

 

 టాలీవుడ్ లో టాప్ నిర్మాతగా ఉన్న సురేష్ సంస్థ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు, మరో బడా నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి వంటి వారు జగన్ని కలసి తాజాగా కలసి చాలా సేపు మాట్లాడారు. జగన్ కూడా వారితో బాగానే మాట్లాడారు. ఇది మంచి వాతావరణంలో జరిగిన భేటీగా చెబుతున్నారు.

 

అన్నీ అనుకూలిస్తే విశాఖ పాలనా రాజధాని అవుతుంది. అదే కనుక జరిగితే హైదరాబాద్ లోని టాలీవుడ్ కి పెద్ద పోటీగా విశాఖ తయారు కావడం ఖాయమని అంటునారు. ఇక  రెండు దశాబ్దాల క్రితమే దగ్గుబాటి రామానాయుడు భీమిలీలో స్టూడియో నిర్మించారు. అక్కడ సినీ ప్రముఖులకు పెద్ద ఎత్తున భూములు కూడా ఉన్నాయి. అందుకే చిరంజీవి కూడా విశాఖకు జై కొట్టారని  అంటారు. ఇపుడు చిరంజీవి కేసీయార్ అభిమానం జల్లుల్లో తడుస్తున్నారు. 

 

దాంతో సురేష్ టీం జగన్ తో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటోంది. జగన్ కి కూడా ఇది అవసరమే. సినీ రంగంలోని పెద్దలు ముందుకు వస్తే మేలు చేయడానికి జగన్ కూడా రెడీగా ఉన్నారు. విశాఖలో  సినీ పరిశ్రమ ఏర్పాటు వైసీపీ అజెండాలో ఉంది. మొత్తానికి టాలీవుడ్లో రాజకీయాలు కూడా రెండుగా చీలడంతో వైసీపీ, వర్సెస్ టీయారెస్ గా కూడా వ్యవహారం సాగుతోందని అంటున్నారు. చూడాలి మరి ఈ సినీ మాయ రాజకీయాలను ఎలా కమ్ముకుంటుందో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: