టాలీవుడ్‌లో ఫిబ్ర‌వ‌రి నెల కాల‌గ‌ర్బంలో క‌లిసి పోయింది. ఇక రేప‌టి నుంచి మార్చి బాక్సాఫీస్ స‌మ‌రం స్టార్ట్ కానుంది. ఫిబ్ర‌వ‌రి నెల స్టార్ హీరో ఎవ‌రో ఇండియా హెరాల్డ్ వెబ్ పోర్ట‌ల్ విశ్లేషించి అవార్డు ప్ర‌క‌టించింది. ముందుగా ఈ నెల‌లో రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లో తొలి శుక్ర‌వారం వ‌చ్చిన శ‌ర్వానంద్ జాను సినిమాలో అత‌డి న‌ట‌న సూప‌ర్బ్‌. అయితే త‌మిళ్‌లో విజ‌య్ సేతుప‌తి చేసిన పాత్ర‌లో కనిపించిన శ‌ర్వా  ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అయితే కొన్ని చోట్ల విజ‌య్‌ను మ‌క్కికి మ‌క్కీ దించేసిన‌ట్లుంది. తన కోసం జాను ఎదురు చూసిందన్న విషయం తెలిసినపుడు శర్వా హావభావాలు వావ్ అనిపిస్తాయి. అయితే శ‌ర్వా ఎంత‌గా న‌టించినా రీమేక్ సినిమా కావ‌డం.. ఈ పాత్ర అంద‌రికి క‌నెక్ట్ కాక‌పోవ‌డం మైన‌స్ అయ్యింది.



ఇక వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమాతో మ‌రోసారి త‌న న‌ట‌న ఏంటో విజ‌య్ ఫ్రూవ్ చేసుక‌న్నాడు. ఈ సినిమాలో అతడి పాత్ర అనేక రకాలుగా కనిపిస్తుంది. లుక్స్ విషయంలోనే కాదు.. నటన పరంగానూ అతను వైవిధ్యం చూపించాడు. పూర్తి స్థాయి తేలంగాణ గ్రామీణ యాసతో సాగే శీనయ్య పాత్రలో విజయ్ చాలా కొత్తగా కనిపిస్తాడు. అయితే కొన్ని చోట్ల సినిమాతో పాటు అత‌డి న‌ట‌న కూడా అత‌డి గ‌త సినిమా అయిన అర్జున్‌రెడ్డిని పోలి ఉండ‌డం పెద్ద మైన‌స్ అయ్యింది. ఇక సినిమా ప్లాప్ అవ్వ‌డంతో విజ‌య్ న‌ట‌న‌కు కూడా పేరు రాలేదు.



ఇక భీష్మ సినిమాలో నితిన్ కాస్త ప్ర‌త్యేకంగా అనిపించాడు. వరుసగా మూడు ఫ్లాపులొచ్చినా నితిన్ ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చాలా కాన్ఫిడెంట్ గా భీష్మ పాత్రలో ఒదిగిపోయిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ర‌ష్మిక‌తో రొమాంటిక్ సీన్ల‌తో పాటు చాలా ఎంట‌ర్టైనింగ్‌గా ఈ క్యారెక్ట‌ర్‌ను ఎంజాయ్ చేశాడు. ఇక భీష్మ పాత్ర బాగా పండ‌డంతో పాటు యూత్‌కు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. ఇక హిట్ సినిమాలో విశ్వ‌క్‌సేన్ బ‌య‌ట తాను నేచుర‌ల్‌గా క‌నిపించే తీరుకు భిన్నంగా క‌నిపించాడు.



విశ్వ‌క్‌సేన్ ఏంటి ? అత‌డు సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ ఏంట‌ని చాలా మంది షాక్‌కు గుర‌వుతారు. ఈ పాత్రకు ఇతనే కరెక్ట్ అనే ఫీలింగ్ చాలా త్వరగా కలిగించి.. తనతో పాటు ట్రావెల్ అయ్యేలా చేశాడతను. అయితే ఈ పాత్ర‌కు అత‌డు న్యాయం చేసినా ఇది అంద‌రికి క‌నెక్ట్ అయ్యే పాత్ర కాదు. ఓవ‌రాల్‌గా చూస్తే ఫిబ్ర‌వ‌రి నెల‌లో వ‌చ్చిన నాలుగు సినిమాల్లో హిట్లో విశ్వ‌క్‌సేన్ పాత్ర ప‌రిమితం కాబ‌ట్టి అది ప‌క్క‌న పెట్టేస్తే శ‌ర్వానంద్‌, విజ‌య్ పాత్రలు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ఎక్క‌లేదు. ఇక వ‌రుస ప్లాపుల త‌ర్వాత కూడా చ‌క్క‌టి ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌లో చాలా ఈజ్‌తో న‌టించిన నితిన్‌కు ఇండియా హెరాల్డ్  FEB 2020 అవార్డు సొంత‌మైంది. భీష్మ‌తో ఈ అవార్డు సొంతం చేసుకున్న నితిన్ భ‌విష్య‌త్తులో మ‌రెన్నో హిట్ సినిమాలు తీయాల‌ని కోరుకుంటూ ఇండియా హెరాల్డ్ ఫ్యామిలీ త‌ర‌పున అభినంద‌న‌లు.

మరింత సమాచారం తెలుసుకోండి: