టాలీవుడ్‌లో ఫిబ్ర‌వ‌రి నెల‌లో హెరాల్డ్ బెస్ట్ హీరోయిన్ అవార్డు కోసం ప‌లువురు హీరోయిన్లు పోటీ ప‌డినా ఇందులో అంతిమంగా ఒక్క హీరోయిన్ త‌న తిరుగులేని న‌ట‌న‌తో మిగిలిన హీరోయిన్ల‌ను డామినేట్ చేసి అవార్డు సొంతం చేసుకుంది. ఈ నెల‌లో ముందుగా జాను సినిమాలో హీరోయిన్‌గా స‌మంత న‌టించింది. ఎలాంటి పాత్ర‌ను అయినా అవ‌లీల‌గా ఔపోసాన ప‌ట్టి న‌టించే స‌మంత‌కు ఈ సినిమాలో పాత్ర కూడా కొట్టిన పిండి మాదిరిగానే అనిపించింది. ఆల్రెడీ త‌మిళ్‌లో 96 సినిమాలో త్రిష ఈ పాత్ర పోషించ‌గా తెలుగులో ఆమెను మించిన న‌ట‌న క‌న‌ప‌ర‌చ‌డం స‌మంత‌కే చెల్లింది. సమంత తనదైన శైలిలో జాను పాత్రను పండించింది. లుక్స్ పెర్ఫామెన్స్ విషయంలో త్రిష‌కు స‌మంత‌కు కంపేరిజ‌న్ చేయ‌లేక‌పోయినా తెలుగులో ఈ పాత్ర చేసేందుకు స‌మంత‌ను మించిన చాయిస్ లేద‌ని ఖ‌చ్చితంగా చెప్పాలి.



ఇక వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమాలో న‌లుగురు హీరోయిన్లు ఉన్నా ఇందులో ఇద్ద‌రి గురించే మాట్లాడుకోవాలి. యామిని పాత్రలో రాశి ఖన్నా బాగా న‌టించింది. ఆమె పాత్ర బాగోలేక‌పోయినా రాశీ వ‌ర‌కు ట్రై చేసింది. ఇక న‌లుగురు హీరోయిన్ల‌లో ఉత్త‌మ పెర్పామెన్స్ మాత్రం ఐశ్వ‌ర్యా రాజేష్ ఇచ్చింది. ఆమెకు స్క్రీన్ టైం తక్కువే కానీ.. ఆ తక్కువలోనే అద్భుతంగా నటించి మెప్పించింది. ప‌ల్లెటూరి అమ్మాయిగా.. గ్రామీణ నేప‌థ్యం ఉన్న భార్య‌గా ఐశ్వ‌ర్య న‌ట‌న చూస్తే చాలా రోజుల త‌ర్వాత ఓ తెలుగు అమ్మాయి మంచి హీరోయిన్‌గా మ‌న‌కు దొర‌క‌డం అదృష్ట‌మ‌నే చెప్పాలి. ఇక మిగిలిన ఇద్ద‌రు హీరోయిన్లు కేథరిన్ థ్రెసా ఇజబెల్లా గురించి చెప్పుకోవ‌డానికేం లేదు.



ఇక భీష్మ సినిమాలో న‌టించిన ర‌ష్మిక ఈ పాత్ర‌కు నితిన్ ప‌క్క‌న క‌రెక్టుగా సెట్ అయ్యింది. అయితే స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో ర‌ష్మిక త‌న‌కంటూ ఓ మేన‌రిజ‌మ్ అర్థ‌మ‌వుతుందా ? అన్న పాత్ర కొన్ని రోజులైనా గుర్తుండేలా ఉంది. ఈ సినిమాలో హీరో నితిన్ పూర్తిగా డామినేషన్ చేయ‌డం వల్ల ర‌ష్మిక క్యారెక్ట‌ర్‌ సైడ్ అయిపోయింది. గ్లామర్ విషయంలో రష్మిక కొన్నిసార్లు బాగా అనిపిస్తుంది. ఇక హిట్ సినిమాలో హీరో విశ్వ‌క్‌సేన్ చుట్టూ క‌థ న‌డుస్తుంది. దీంతో హీరోయిన్ రుహాని శర్మ టాలెంట్ చూపించే అవకాశం ఈ సినిమా ఇవ్వలేదు.



ఇక హెరాల్డ్ బెస్ట్ హీరోయిన్‌ అవార్డు FEB 2020 కొసం ఫైన‌ల్ రేసులో స‌మంత‌, ఐశ్వ‌ర్య రాజేష్ ఇద్ద‌రూ రేసులో నిలిచారు. అయితే స‌మంత జాను పాత్ర‌లో ఒదిగిన తీరుతో ఆమే అవార్డు సొంతం చేసుకుంది. స‌మంత‌కు ఇండియా హెరాల్డ్ వ‌సుధైక కుటుంబం త‌ర‌పున అభినంద‌న‌లు.

మరింత సమాచారం తెలుసుకోండి: