బాక్స్ బద్దలు కొట్టాలంటే మెగాస్టార్ అయినా ఉండాలి. లేక మెగా కంటెంట్ అయినా ఉండాలి. మెగాస్టార్ హీరో అయితే చాలు బాక్సులు దుమ్ము రేగాల్సిందే. కలెక్షన్లు పరుగులు తీయాల్సిందే. అదీ మెగా పవర్. అందుకే టాలీవుడ్ బాక్స్ ని బద్దలు కొట్టి ఏకంగా బాలీవుడ్ కే పోటీ ఇచ్చే రేంజికి తీసుకెళ్ళాడు చిరంజీవి.

 

ఇక చిన్న సినిమాలు, మిడిల్ రేంజి హీరోలు హిట్ కొట్టాలంటే అదిరిపోయే కంటెంట్ ఉండాలి. అయితే ఏ సీజన్ కి ఆ సీజన్ లో ఇలాంటి కంటెంట్ దొరుకుతుంది. దానికి తగినట్లుగా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే చాలు హిట్ వచ్చి అలా ఒళ్ళో పడుతుంది.

 

రెండు దశాబ్దాల క్రితం వెంకటేష్ టచ్ చేసిన ఒక  సక్సెస్ ఫుల్ కంటెంట్ ఇపుడు టాలీవుడ్ కి కాసుల పంట పండిస్తోంది. అదే బ్యాచ్ లర్ స్టోరీ అన్న మాట. ఈ కంటెంట్ తో వెంకీ ఎన్నో హిట్లు కొట్టాడు. ముఖ్యంగా పెళ్ళి కాని ప్రసాద్ క్యారక్టర్ అంటే ఆయనే గుర్తుకువచ్చేలా మల్లీశ్వరిలో అదరహో యాక్షన్ చేసి కుమ్మేశాడు.

 

ఇపుడు మళ్ళీ ఆ కంటెంట్ ని పుచ్చుకుని నితిన్ హిట్ కొట్టాడు. భీష్మ సినిమా నితిన్ ఆకలిని బాగా తీర్చేసింది. వరసగా నాలుగు ఫ్లాప్స్ తో  ఉన్న నితిన్ కెరీర్  ని కీలకమైన మలుపు తిప్పింది. యాభై కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నితిన్ కెరీర్ లో ది బెస్ట్ మూవీ అనిపించుకుంది.

 

దీంతో బ్యాక్ టు బ్యాక్ గా ఇదే కంటెంట్ తో మూవీస్ వచ్చేస్తున్నాయి. ఇప్పటికి మూడు ఫ్లాపులతో హిట్ వాసన చూడని అక్కినేని వారసుడు అఖిల్ కూడా బ్యాచ్ లర్  కంటెంట్ నే నమ్ముకున్నాడు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ మూవీని అఖిల్ చేస్తున్నాడు. భాస్కర్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ అఖిల్ కి తొలి హిట్ ఇస్తుందని ధీమాగా ఉన్నాడు.

 

ఇక ప్రతీ రోజూ పండుగతో లేటెస్ట్ గా హిట్ కొట్టిన సాయితేజ్ కూడా బ్యాచ్ లర్ క్యారక్టర్ తో బాక్సాఫీస్ ని కుమ్మేయాలనుకుంటున్నాడు. సోలో బతుకే సో బెటర్ అంటూ తేజూ వచ్చేస్తున్నాడు. ఇపుడు బ్యాచ్ లర్స్ కి పండుగ లాంటి సీజన్ నడుస్తోంది. దాంతో ఈ రెండు మూవీస్ సూపర్ హిట్లు అవుతాయని టాలీవుడ్ ధీమాగా ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: