'బాహుబలి' సినిమా తో ప్రపంచ స్థాయిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఈ సినిమా విజయంతో భారతదేశంలో అన్నీ ఇండస్ట్రీలలో రికార్డులను అధిరోహించాడు. సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. బాహుబలి సినిమా ముందు నెలకు సినిమా రంగానికి పరిమితమైన ప్రభాస్ మార్కెట్ ఆ తరువాత బాహుబలి సినిమా విజయంతో ఇండియా వైడ్ తో పాటు ఇంటర్నేషనల్ స్థాయిలో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇటువంటి తరుణంలో బాహుబలి తర్వాత అదే స్థాయిలో విజయం సాధించాలని సాహో సినిమా చేశారు. సుజిత్ దర్శకత్వం లో ప్రభాస్ నటించిన ఈ యాక్షన్ సినిమా దారుణమైన ఫ్లాప్ టాక్ సొంతం చేసుకొని విడుదలైన ప్రతి భాషలో బొక్క బోర్లా పడింది.

 

దాదాపు ఈ సినిమా కోసం రెండు సంవత్సరాల పాటు తన సమయాన్ని కేటాయించిన ప్రభాస్ సినిమా ఫ్లాప్ కావడంతో చాలా నిరుత్సాహం చెందారు. ఇదే సమయంలో ప్రభాస్ అభిమానులు కూడా అనవసరంగా సాహో సినిమా చేసినట్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వం లో ఒక పాత కాలం నాటి ప్రేమ కథ సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ మార్చ్ 25 వ తారీఖున రిలీజ్ చేయటానికి నిర్మాణ భాగస్వామ్యంలో ఒకరైన యువి క్రియేషన్స్ సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.

 

ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పాత కాలం నాటి ప్రేమ కథ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఇప్పటివరకు ఎవరు నటించని ఓ ప్రేమికుడి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి యూరప్ షెడ్యూల్ మార్చి నెల మొదటి వారం నుండి జరగనున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. సినిమా అనుకున్నంత టైములో అయిపోతే కనుక ఈ ఏడాది చివరిలో లేకపోతే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: