యంగ్ హీరో శర్వానంద్ హిట్టు లేక అల్లాడుతున్నాడు. ఓ స్ట్రాంగ్ హిట్ పడితే కానీ హీరో కెరీర్ గాడిలో పడేలా కనిపించడం లేదు. ఎన్నో హోప్స్ పెట్టుకున్న క్లాసిక్ రిమేక్ బోల్తా కొట్టడంతో శర్వా పరిస్థితి మరింత దారుణంగా మారింది. మరికొత్త సినిమాతో అయినా శర్వానంద్ హిట్ కు శ్రీకారం చుడతాడేమో చూడాలి. 

 

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న మంచి పెర్ఫామెన్స్ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకడు. పాత్ర ఏదైనా సహజమైన నటనతో రక్తికట్టిస్తాడు. కానీ ఈ మధ్య శర్వానంద్ ఎలాంటి కథతో సినిమా చేసినా ఫలితం మాత్రం తేడా కొడుతోంది. ఈ యంగ్ హీరో సక్సెస్ ముఖం చూసి నాలుగేళ్లు దాటుతోంది. వరుస ఫ్లాపులతో శర్వా మార్కెట్ డౌన్ అవుతోంది. ఈ క్రమంలో ఈ యంగ్ హీరో హోప్స్ అన్నీ కొత్త సినిమాపైనే ఉన్నాయి. 

 

శతమానం భవతి శర్వానంద్ కు సక్సెస్ పరంగా అసలు కలిసిరావడం లేదు. రాధా, పడిపడి లేచె మనసు, రణరంగం హ్యాట్రిక్స్ ఫ్లాప్స్ శర్వాను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇక రీసెంట్ గా రిలీజైన జాను మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు. మంచి టాక్ వచ్చినా పాజిటివ్ రివ్యూలు వచ్చిన సినిమా మాత్రం కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. స్ట్రాంగ్ హిట్ కొడితేనే ఈ యంగ్ హీరో కోలుకునేలా లేడు. 

 

ప్రస్తుతం శర్వానంద్ చేతిలో మూడు సినిమాలున్నాయి. ఈ యంగ్ హీరో త్వరలో శ్రీకారం సినిమాతో రాబోతున్నాడు.  ఈ చిత్రం ద్వారా కిశోర్ అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై శర్వానంద్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.  మరి శ్రీకారం సినిమాతో శర్వా సక్సెస్ లకు శ్రీకారం చుడతాడేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: