టాలీవుడ్‌లో ఫిబ్ర‌వ‌రి నెల‌లో వ‌చ్చిన సినిమాల్లో బెస్ట్ ప్రొడ్యుస‌ర్ అవార్డు ఏ నిర్మాత‌కు ఇవ్వాలి ? ఈ నెల‌లో వ‌చ్చిన సినిమాల్లో ఏ నిర్మాత సినిమాకు రాజీ ప‌డ‌కుండా ఖ‌ర్చు చేశాడు ?  ఏ నిర్మాత ఉత్త‌మ అభిరుచితో సినిమా నిర్మించాడు ? అన్న‌ది ప‌రిశీలిస్తే ఒక్కో సినిమాకు ఒక్కో నిర్మాత ఒక్కోలా ఖ‌ర్చు చేశార‌నిపిస్తుంది. జాను సినిమా విష‌యానికి వ‌స్తే కోలీవుడ్‌లో వ‌చ్చిన 96 సినిమాకు రీమేక్ కావ‌డంతో ఈ సినిమాకు ఇక్క‌డ రీమేక్‌గా వ‌చ్చిన జానుకు పెద్ద‌గా ఖ‌ర్చు పెట్ట‌డానికేం లేదు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఆ త‌ర్వాత కూడా ప్ర‌మోష‌న్ల విష‌యంలో కూడా దిల్ రాజు పెద్ద‌గా దృష్టి పెట్టిన‌ట్టు లేదు.



అయితే జాను నిర్మాణ విలువల విషయంలో వంక పెట్టడానికేమీ లేదు. సినిమాకు ఏం అవసరమో అదంతా సమకూర్చింది దిల్ రాజు టీం. ఇక వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమా విష‌యానికి వ‌స్తే ఈ సినిమా విజ‌య్ మార్కెట్‌ను మించి ఖ‌ర్చు చేశార‌నే చెప్పాలి. అప్ప‌టికే మూడు ప్లాపుల్లో ఉన్నా కూడా నిర్మాత కేఎస్‌. రామారావు ఏకంగా న‌లుగురు హీరోయిన్ల‌ను పెట్టి మ‌రీ ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా ఈ సినిమాను నిర్మించారు. క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మాణ విలువల విషయంలో రాజీ పడలేదు. తన స్థాయిని చాటుకుంటూ సినిమాకు అవసరమైనంత మేర ఖర్చు పెట్టింది.



అయితే ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్ ఇన్ని వ‌న‌రులు ఉన్నా సినిమాకు స‌రిగా వాడుకోలేకోయాడు. ఇక నితిన్ భీష్మ సినిమా విష‌యంలో సితార ఎంట‌ర్టైన్‌మెంట్స్ ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా ఖ‌ర్చు చేసింది. గ‌తంలో ఛ‌లో సినిమాకు ప‌రిమిత వ‌న‌రుల‌తోనే సినిమా తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల ఈ సినిమా విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డ‌కుండా బ‌డ్జెట్ ఉండ‌డంతో రిచ్‌గా సినిమాను డిజైన్ చేసుకున్నాడు. సూర్య దేవ‌గ నాగ‌వంశీ ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు.


ఇక చివ‌రి వారం రిలీజ్ అయిన నాని - విశ్వ‌క్‌సేన్ హిట్ సినిమా ఓ వ‌ర్గం ప్రేక్ష‌కులు (థ్రిల్ల‌ర్ జాన‌ర్ సినిమాలు ఇష్ట‌ప‌డేవారికి ) న‌చ్చినా నాని ఈ సినిమాపై ఉత్త‌మ అభిరుచితో నిర్మించాడ‌నే చెప్పాలి. హిట్ నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు శైలేష్ కొలనుకు థ్రిల్లర్ జానర్ మీద పట్టుందని సినిమా చూస్తే అర్థమవుతుంది. నాని అ... సినిమా సైతం క‌మ‌ర్షియ‌ల్ వ‌సూళ్ల‌తో సంబంధం లేకుండా నానికి మంచి పేరు తేడంతో పాటు ఉత్త‌మ సినిమాగా అవార్డులు గెలుచుకుంది. ఇక ఓవ‌రాల్‌గా ఉత్త‌మ ప్రొడ్యుస‌ర్ అవార్డు కోసం సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, నాని ఇద్ద‌రూ పోటీ ప‌డ్డారు. కేఎస్‌.రామారావు కూడా తిరుగులేకుండా ఖ‌ర్చు చేసినా ఆయ‌న ఖ‌ర్చంతా ఓ చెత్త క‌థ మీద పెట్టేశారు. ఫైన‌ల్‌గా ఇండియా హెరాల్డ్ బెస్ట్ ప్రొడ్యుస‌ర్‌ అవార్డు FEB 2020కు గాను హిట్ సినిమా కోసం నానికే ద‌క్కింది. నాని భ‌విష్య‌త్తులో మ‌రెన్నో మంచి సినిమాలు నిర్మించాల‌ని ఇండియా హెరాల్డ్ వ‌సుధైక కుటంబం కోరుకుంటోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: