ఒక సినిమా సూపర్ హిట్ అయిందంటే అందరూ ఆ సినిమా దర్శకుడిని లేదా హీరో, హీరోయిన్ ని అలాగే నిర్మాతని పొగిడేస్తారు. హీరో హీరోయిన్ గురించి ఎక్కువగా మాట్లాడతారు. ఇంటర్వ్యూస్ కూడా ఎక్కువగా హీరో హీరోయిన్స్ లేదా డైరెక్టర్స్ నే చేస్తారు. వాళ్ళే అందరికీ కనిపిస్తారు. క్రెడిట్ అంతా వాళ్ళకే దక్కుతుంది. ఇక హీరోయిన్ బాగా నటించిందని అందంగా ఉందని కుప్పలు కుప్పలు హీరో కి లిప్ కిస్సులిచ్చిందని చర్చించుకుంటారు. అలాగే హీరో డాన్స్ ఇరగదీశాడని, ఫైట్స్ అరగదీశాడని పోకడలు పోతారు.

 

ఇక దర్శకుడి గురించైతే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. కానీ ఇదంతా ఒక ఎడిటర్ వల్ల సాధ్యమైందన్న విషయం మాత్రం చాలా తక్కువ సందర్భాలలో చర్చించుకుంటారు. హీరో డాన్సులు చేసినా హీరోయిన్ గ్లామర్ ని ఒలకబోసినా దర్శకుడు ఇష్టమొచ్చినంత రష్ తెచ్చి ఎడిటింగ్ టేబుల్ మీద పడేసినా చాలా ఓపికగా అదంతా ఒక పద్దతి ప్రకారం చాలా జాగ్రత్తగా ఎడిట్ చేసి ఒక రూపం తీసుకు వస్తాడు ఎడిటర్. 

 

అందుకే కొంతమంది డైరెక్టర్ మాత్రమే ఎడిటర్స్ ని గుర్తిస్తారు. అలాంటి ఫేమస్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. ఆయన అరుదైన ఘనతను సాధించారు. 8 సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ సీనియర్ ఎడిటర్ ప్రతిష్టాత్మక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించడం గొప్ప విశేషం. 17 భారతీయ భాషల్లో సినిమాలకు ఎడిటింగ్ టేబుల్ పై కట్ చెప్పి తీర్పు చెప్పిన మొదటి ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ గుర్తింపును దక్కించుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 37 సంవత్సరాల కెరీర్ లో శ్రీకర్ ప్రసాద్ సుమారు 500 సినిమాలను ఎడిట్ చేశారు. అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు సింహళీ- కర్బి- మిషింగ్- బోడో -పాంగ్ చెన్పా భాషలలో కూడా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పని చేశారు. 

 

ఇక గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన చాలా సినిమాలకు శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ అన్న విషయం కూడా ఎంతో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. అంతే కాదు బాలీవుడ్ సినిమాలతో పాటు.. దక్షిణ భారత సినిమాలకు పనిచేసిన ఎడిటర్ గా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. ఎడిటింగ్ టేబుల్ పై లెవెంథ్ అవర్ టెన్షన్స్ ని తగ్గించిన గ్రేట్ ఎడిటర్ గానూ శ్రీకర్ ప్రసాద్ కి పేరుంది. ఎందరో టాప్ స్టార్లు.. టాప్ డైరెక్టర్లు.. నిర్మాతలు ఆయనను నమ్మి ఫైనల్ కట్ ని వదిలేస్తుంటారని, ఆయన చెప్పిందే ఫైనల్ అని నమ్మే వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారంటే ఆయన ప్రతిభ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంత గొప్ప పేరు గాని టాలెంట్ గాని ఉన్న సీనియర్ ఎడిటర్స్ లో శ్రీకర్ ప్రసాద్ చాలా అరుదైన వ్యక్తి అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: