నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వి సినిమాతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే వి సినిమాలో సుధీర్ బాబుతో కలిసి నటిస్తున్న నాని, ఆ సినిమాలో తొలిసారిగా నెగటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని బట్టి చూస్తుంటే, ఈ సినిమాలో నాని క్యారెక్టర్ అదిరిపోనుందని కొంతవరకు మనకు అర్ధం అవుతుంది. ఇకపోతే ఈ రెండు సినిమాలతో పాటు నాని నటించబోయే తదుపరి సినిమాకు సంబంధించి రెండు రోజుల క్రితం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటన రావడం జరిగింది. 

 

గతంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీ వాలా సినిమాకు దర్శకత్వం వహించిన యువ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమాకు శ్యామ్ సింగ రాయ్ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఇక మంచి సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి వార్తలు అందుతున్నాయి. వారిలో ఒకరు సాయి పల్లవి కాగా, మరొకరు రష్మిక అని అంటున్నారు. ఇక ఈ సినిమా కథ కథనాలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయని, అలానే కెరీర్ పరంగా నాని ఇప్పటివరకు పోషించని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో పోస్తిస్తున్నట్లు చెప్తున్నారు. 

 

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తాం కానున్న ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని దర్శక నిర్మాతలు అభిప్రాయపడుతున్నారట. ఇక ఇటీవల ఇదే బ్యానర్ నుండి నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ సూపర్ హిట్ కొట్టడం జరిగింది. మరి తన కెరీర్ లో తొలిసారిగా సైన్స్ ఫిక్షన్ స్టోరీ లో నటిస్తున్న నాని, ఈ సినిమా ద్వారా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: