ఏ ముహూర్తాన సందీప్ రెడ్డి వంగా టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి సినిమ తీశాడో గానీ ఇప్పటికి విజయ్ దేవరకొండసినిమా మూడ్ లో నుండి బయటకి రావడం లేదు. ఆ తర్వాత వచ్చిన ప్రతీ సినిమాలోను విజయ్ అదే యాటిట్యూడ్ చూపిస్తున్నాడన్న విమర్శలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్‌గా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా విజయ్ అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ లో ఉండి నటించాడని కామెంట్స్ చేశారు. అంతేకాదు విజయ్ తో ఈ సినిమా తీసి అతన్ని పూర్తిగా చెడగొట్టావని దర్శకుడు సందీప్ రెడ్డి వంగాని ఏకిపారేశారు.

 

ఇదిలా ఉంటే ఈ డైరెక్టర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సందీప్ ఏ హీరోకి వెళ్ళి కథ చెప్పినా అర్జున్ రెడ్డి ఫ్లేవర్ నే ఫీలవుతున్నారట. దాంతో నైస్ గా చూద్దాం చేద్దాం అంటూ వెనక్కి పంపిస్తున్నారట. ఇక ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్లో కొత్త సినిమా ప్రకటన వచ్చి అందరికీ షాకిచ్చింది. ప్రభాస్ కు కథ చెప్పారంటూ పలువురు దర్శకుల పేర్లు వార్తల్లో వినిపించాయి కానీ నాగ్ అశ్విన్ పేరు అసలెక్కడా వినిపించలేదు. 

 

అయితే నాగ్ అశ్విన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రభాస్ అందరికీ పెద్ద షాకిచ్చారనే చెప్పాలి. ఈ ప్రకటనతో ప్రభాస్ కు కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్న మిగతా డైరెక్టర్స్ కి ప్రభాస్ తో నెక్స్ట్ సినిమా లేదని తేలిపోయినట్టే. అలాంటివారిలో సందీప్ వంగా ఒకరు. అర్జున్ రెడ్డి'.. 'కబీర్ సింగ్' సినిమాలతో ఇటు టాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లోనూ సంచలన విజయాలు సొంతం చేసుకున్న సందీప్ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా ఇంకా సెట్ కాలేదు.

 

మొదట్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు కథ వినిపించారని.. మహేష్ కూడా ఇంట్రెస్ట్ చూపించారని అన్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ గురించి అసలు మాటే వినబడటం లేదు. ఇక బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో సినిమా ఫిక్స్ అయింది. టీ సీరీస్ వారి నిర్మాణంలో ఆ తెరకెక్కుతుందని ప్రకటన కూడా వచ్చింది. కానీ లాస్ట్ మినిట్ లో రణబీర్ నో చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది.  

 

బాలీవుడ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో ప్రభాస్ తో సినిమా చేసేందుకు సందీప్ ప్రయత్నిస్తున్నాడని వార్తలు వచ్చాయి. సందీప్ అటు బాలీవుడ్ లో కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి ఉన్నాడు కాబట్టి ప్రభాస్-సందీప్ సినిమా దాదాపు ఫిక్స్ అయిందని అనుకున్నారు. నాగ్ అశ్విన్ కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి అది మిస్ అయినట్టేనని ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న మాట.

 

రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన డైరెక్టర్ నెక్స్ట్ సినిమాకు స్టార్ హీరోలు దొరకకపోవడం ఆశ్చర్యమే. అయితే ఇక్కడ అసలు సమస్య సందీప్ లో ఇంకా అర్జున్ రెడ్డి ఛాయలు పోవడం లేదట. ఆ మూడ్ నే ఇంకా కంటిన్యూ చేస్తూ హీరోలకి కథ నెరేట్ చేస్తున్నాడట. అందుకే హీరోలు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు సందీప్ రెడ్డి తనని తానే దారుణంగా తిట్టుకుంటున్నాడట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: