హీరోయిన్ గజాలా గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ హీరో జగపతి బాబు హీరోగా నటించిన నాలో ఉన్న ప్రేమ సినిమాతో టాలీవుడ్ లో ఎంటరయింది. కాని ఆ సినిమా అంతగా ఆడలేదు. అయుతే గజాలా మాత్రం తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్.టి.ఆర్ హీరోగా పరిచయమవుతూ, రాజమౌళి దర్శకుడిగా మారుతూ తెరకెక్కిన సినిమా స్టూడెంట్ నంబర్ 1. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. దాంతో గజాలా కి వరుసగా టాలీవుడ్ లో మంచి అవకాశాలు వచ్చాయి. ఎన్.టి.ఆర్ తోనే రెండు సినిమాలు చేసింది గజాలా. అలాగే ఉదయ్ కిరణ్ తోను కలుసుకోవాలని సినిమా చేసింది.

 

ఈ.ఈ.వి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన తొట్టి గ్యాంగ్ సినిమా కూడా గజాలాకి మంచి పేరు తెచ్చింది. అలాగే తమిళంలోను కొన్ని సినిమాలు చేసింది. అలా నటుడు అర్జున్ తో క్లోజ్ గా ఉండేది. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ లో ఉన్నప్పుడు గజాలా ఓవర్  డోస్ లో నిద్ర మాత్రలు మింగి ఆత్మ హత్యాయత్నం చేసింది. ఆపర్మిక స్థితిలో ఉన్న గజాలా విషయం తెలియగానే అర్జున్ అర్థరాత్రి నింస్ కి తీసుకు వెళ్ళారు. ఆ సమయంలో మీడియా మొత్తం అర్జున్ మీదే ఫోకస్ చేసింది.

 

అర్జున్ వల్లనే గజాలా సూసైడ్ అటెంట్ చేసిందని ఆయనే తనని శారీరకంగా బలవంత పెట్టారని అది భరించలేని గజాలా నిద్ర మాత్రలు మింగి ఆత్మ హత్య చేసుకోబోయిందని వార్తలు వచ్చాయి. ఈ విషయం అప్పట్లో సంచలనం అయింది. దాదాపుగా అందరు అర్జున్ కటకటాలపాలవడం ఖాయమని డిసైడైయ్యారు. కాని గజాలా అసలు ఈ సంఘటనకి అర్జున్ కి సంబంధం లేదని తను వేరే వ్యక్తి వల్ల మోసపోయి ఆ బాధ భరించలేక చనిపోవాలనుకున్నానై క్లారిటీ ఇస్తేగాని అర్జున్ మీద నింద తొలగిపోలేదు. కానీ ఈ సంఘటన మాత్రం అర్జున్ ని చాలా కాలం వెంటాడింది. ఒకవేళ గనక గజాలా చనిపోయి ఉంటే జీఇవితాంతం అర్జున్ నరకం అనుభవించేవాడని వాపోయాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: