మిమిక్రీ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయిన వేణు మాధవ్ ఆ తర్వాత సినిమాలలోకి వచ్చి స్టార్ కమెడియన్ గా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ప్రయాణం మొదలు పెట్టిన వేణు మాధవ్ నిర్మాతగా సినిమా నిర్మించే స్థాయికి ఎదిగాడంటే దీని వెనక వేణు మాధవ్ ఎంతగా కృషి చేసి కష్ఠపడ్డారో అర్థం చేసుకోవచ్చు. సినిమాలలోకి రాకముందు వేణు జీవితం చాలా దారుణంగా ఉండేది. ఉండటానికి కూడా ఇల్లు ఉండేది కాదు.

 

కోదాడలో వెంట్రిలాక్విజాన్ని ప్రజలకు పరిచయం చేశాడు వేణు మాధవ్. అందుకు ఆయన చదివే కళాశాల ప్రిన్సిపల్ సహకరించారు. ఆ కార్యక్రమానికి చుట్టు పక్కల ఉన్న రాజకీయనాయకులు హాజరయ్యారు. శాసన సభ్యులు చందర్ రావు ఆ ప్రదర్శనను చూడటం ఆ మహానాడు ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పడం తరువాత ఎన్టీఆర్ వేణు దగ్గరికి వచ్చి ”మీ సేవలు మాకెంతో అవసరం బ్రదర్” అని చెప్పి అక్కున చేర్చుకోవడం తో వేణు మాధవ్ దశ తిరిగింది.

 

ఆ తర్వాత రవీంద్రభారతిలో వేణుమాధవ్ చేసిన కామెడీ స్కిట్ తన జీవితాన్నే మార్చేసింది. వేణుమాధవ్ ఆ కార్యక్రమంలో 'గుల గుల గులాబ్ జామ్' అంటూ చెప్పిన డైలాగ్ ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలకు చాలా బాగా నచ్చి, సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆయన మొదటి సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా వచ్చిన సంప్రదాయం అనే సినిమా. అప్పటివరకు మిమిక్రీ ప్రోగ్రాంకు రూ. 1000 మాత్రమే తీసుకునే వేణుమాధవ్‌కు ఆ సినిమా కోసం రూ. 70వేలు పారితోషికంగా ఇచ్చారు.

 

నటుడిగా వేణుమాధవ్ తొలి రెమ్యునరేషన్ అదే. ఆ వేణు మాధవ్ ఇక వెను తిరిగి చూసుకోలేదు. ‘తమ్ముడు’, ‘ప్రియమైన నీకు’, ‘స్టూడెంట్ నెం.1’, ‘ఆది’, ‘నువ్వే నువ్వే’, ‘దిల్’, ‘సింహాద్రి’, ‘వెంకీ’, ‘ఆర్య’, ‘సాంబ’, ‘గౌరి’, ‘గుడుంబా శంకర్’, ‘సై’, ‘ఛత్రపతి’, ‘బన్నీ’, ‘లక్ష్మి’, ‘జై చిరంజీవ’, ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.’, ‘కృష్ణ’, ‘యోగి’ వంటి చిత్రాలు ఆయనను  కమెడియన్‌గా మరోస్థాయికి తీసుకెళ్లాయి. ‘హంగామా’, ‘భూకైలాస్’, ‘ప్రేమాభిషేకం’ చిత్రాల్లో వేణు హీరోగా నటించి నిర్మించాడు.

 

అయితే ఆయన ఆఖరి రోజులు మాత్రం అత్యంత దయనీయంగా మారాయి. మనిషిని గుర్తు పట్టని విధంగా తయారయ్యారు. హాస్పిటల్ లోనే చాలా రోజులు గడిపారు. అంతకన్నా ముందే కొన్ని సోషల్ మీడియాలో వేణు మాధవ్ చనిపోయాడని తప్పుడు ప్రచారం చేశారు. ఇది కూడా వేణు మాధవ్ ని బాగా కృంగదీసింది. ఆరోగ్య సమస్యలతో సతమమవుతున్న వేణు మాధవ్ ని ఇంకా కృంగిపోయోలా చేశాయి బయట ప్రచారం అయిన గాలి వార్తలు. ట్రీట్ మెంట్ తీసుకుంటున్న వేణు మాధవ్ హఠాత్తుగా మరణించారు.

 

అయితే ఈ విషయం తెలియగానే ఒక వైపు రోధిస్తూనే మరో వైపు ఆయన సంపాదించిన ఆస్థులు ఎక్కడెక్కడున్నాయి.. ఎవరెవరి పేరు మీద ఉన్నాయని వేణు మాధవ్ కుటుంబ సభ్యులు ఆరాలు తీయడం మొదలు పెట్టారట. వాస్తవంగా వేణు మాధవ్ సంపాదన మీదే ఆయన సోదరులు మిగతా కుటుంబ సభ్యులు జీవిస్తున్నారు. ఆయన సంపాదించినదంతా వాళ్ళకే పెట్టారు. అయినా మనిషి పోయాడనగానే ఆస్థులకొసం వెంపర్లాడారట. ఇది మహా దారుణం. 

మరింత సమాచారం తెలుసుకోండి: