ఏ సినిమాకైనా ప్రచారం ఖచ్చితంగా కావాల్సిందే. మన సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవాలంటే మన సినిమాలో ఏదో ఉందని వాళ్లకి తెలియజేయాలి. అవును ప్రతీ శుక్రవారం థియేటర్లలో ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయి. కానీ అన్ని సినిమాలు జనాలకి గుర్తుండవు. ఏదో ఒక సినిమా మాత్రమే జనాలకి నచ్చుతుంది. ఆ వారం ఆ సినిమానే విజేతగా నిలుస్తుంది. అయితే జనాలని సినిమా థియేటర్లకి తీసుకొచ్చే ఆయుధం ’ప్రమోషన్’.

 

 


ఎంత మంచి సినిమా అయినా ప్రమోషన్ సరిగ్గా చేయక వెనకబడిపోతుంటుంది. అదే మళ్ళీ టీవీల్లో వస్తే అరె మంచి సినిమా ఎలా మిస్సయ్యాం అని ఫీల్ అవుతుంటాం. విశ్వక్ సేన్ హీరోగా రుహానీ శర్మ హీరోయిన్ గా నటించిన హిట్ అనే మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టీజర్ విడుదల అయినప్పటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్లు జనాలకి బాగా ఆకర్షించాయి.

 

 

దాంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళితో పాటు అనుష్క, రానాలని తీసుకురావడంతో సామాన్య జనానికి కూడా ఈ సినిమా మీద ఆసక్తి కలిగింది. అలా ఇంట్రెస్ట్ ని తీసుకువచ్చి సినిమాలోని అతి ముఖ్యమైన సన్నివేశాన్ని రివీల్ చేసి సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు. నిన్న విడుదల అయిన సినిమాలన్నింటిలో హిట్ సినిమాకి చాలా పాజిటివ్ బజ్ వచ్చింది. అంతే కాదు ఇప్పుడు ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ కూడా పడ్డాయి.

 

 

విడుదలైన ప్రతీ చోటు నుండి సినిమా బాగుందంటూ వార్తలు వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూశామని ప్రేక్షకులు చెప్తున్నారు. అటు ప్రమోషన్లలో అదరగొట్టిన హిట్ టీమ్ సినిమా విషయంలోనూ ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదని తెలుస్తుంది. మరింకా ఎందుకాలస్యం ఆ థ్రిల్ ని మీరూ ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: