అఖిల్ అక్కినేని ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీలో సక్సస్ కాని హీరోల లిస్ట్ లో ఉన్నాడు. ఈ అబ్బాయి ఇప్పటి వరకు మూడు సినిమాలు చేస్తే ఆ మూడు డిజాస్టర్స్ గా మిగిలాయి. అఖిల్, హలో, మిస్టర్ మజ్ఞు ..సినిమాలు మూడు కూడా మంచి లవ్ స్టోరీస్. కాని ఎందుకనో ఈ మూడు సినిమాలు దారుణంగా ఫ్లాపయ్యాయి. కానీ అఖిల్ ఒక్కడే కాదు అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఈ సినిమాల మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. సినిమా వస్తున్న ప్రతీసారి హిట్ అన్న ఆశతో ఎదురు చూశారు. కాని ప్రతీసారి వీళ్ళకి షాకే తగిలింది. దాంతో మళ్ళీ కొత్త సినిమాతో రెడీ అవుతున్నాడు అఖిల్. అదే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'. 

 

ప్రస్తుతం అఖిల్ ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలలో ఉన్నారు. ఆ మధ్య ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల ఫస్ట్ లుక్స్ కూడా రిలీజ్ చేశారు. అఖిల్.. పూజా హెగ్డే ల ఫస్ట్ లుక్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఏప్రిల్ లోనే సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు కాబట్టి మార్చ్ రెండో వారం నుంచి ప్రమోషన్స్ లో జోరు పెంచాలని యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఈమధ్య అఖిల్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అఖిల్ ఈ ఫోటోలో కాస్త వెయిట్ పెరిగినట్టు కనిపిస్తున్నాడు. గతంలో అఖిల్ స్లిమ్ గా ఉండేవాడు. 

 

ఇప్పుడు కూడా ఫిట్ గా ఉన్నప్పటికి కానీ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాలో పాత్రకు తగ్గట్టుగా కాస్త వెయిట్ పెరిగాడని అంటున్నారు. అంతేకాదు అఖిల్ సరసన పూజా హెగ్డే కాబట్టి తనకి తగ్గటే కనిపించాలని కాస్త వేయిట్ గేయిన్ చేశాడని సమాచారం. ఇక ఈ సినిమాకు గోపి సుందర్ సంగీత అందిస్తుండగా జీఎ 2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక గత మూడు సినిమాలు ఫ్లాపయిన నేపథ్యంలో ఒకవైపు మేకర్స్ మరో వైపు నాగార్జున చాలా కేర్ తీసుకుంటున్నారట. మరి ఈ సినిమా అయినా అఖిల్ కి హిట్ ఇచ్చి కాస్త క్రేజ్ ఇస్తుందేమో చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: