క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ లో కొందరు సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు, కొత్తగా అవకాశాల కోసం ఇక్కడికి వస్తున్న అమ్మాయిలను ప్రలోభ పరచుకొని, అవకాశాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి, వారిని పలువిధాలుగా లైంగికంగా ఇబ్బందులు పెడుతున్నారని నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇక పై టాలీవుడ్ లో మహిళల కోసమంటూ ప్రత్యేకంగా ఒక వింగ్ ఏర్పాటు చేయాలంటూ శ్రీ రెడ్డి ఆ తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు అర్ధనగ్న ప్రదర్శన కూడా నిర్వహించింది. అయితే దానితో దిగివచ్చిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, మహిళల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటుకు సమ్మతించింది. 

 

ఇక అప్పట్లో ఆ ఘటనతో ఎంతో పాపులర్ అయిన శ్రీ రెడ్డి, ఆ తర్వాత ఒకానొక సమయం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన అభిమానుల ఆగ్రహానికి గురైంది. అంతటితో ఆగకుండా, టాలీవుడ్ లోని కొందరు సినీ ప్రముఖులు తనతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారని అప్పట్లో కొందరి పేర్లు కూడా బయట పెట్టింది శ్రీ రెడ్డి. వారిలో హీరో నాని పై కూడా ఆమె సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత దాన్ని సీరియస్ గా తీసుకున్న నాని, ఆమెకు లీగల్ నోటీసులు కూడా పంపించడం జరిగింది. 

 

ఇక ఇప్పటికీ కూడా కొందరు సినీ, రాజకీయ ప్రముఖులపై సెటైరికల్ గా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా శ్రీ రెడ్డి సెటైర్లు వేస్తూనే ఉంది. ఇకపోతే నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ సినిమాకు సంబంధించి శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. హిట్టా, ఫట్టా, నూని గాడు ఓం బూమ్ ఫట్ అంటగా అంటూ ఆమె చేసిన పోస్ట్ పై పలువురు నెటిజన్లు, కుక్క తోకనైనా వంకర తీయొచ్చు గాని, నీ కంపు నోటికి తాళం మాత్రం ఎవరూ వేయలేరు తల్లో అంటూ తమ సోషల్ మీడియా మాద్యమాల ద్వారా శ్రీరెడ్డి పై కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: