గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఆమె గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు.. ఎందుకంటే ఆమె సినిమాలు అలాంటివి.. ఆమె అందం అలాంటిది. దేవదాసు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా ఇలియానా పోకిరీ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. 

 

ఇలియానా నటనతో పాటు ఆమె లుక్స్‌కి చాలా మంది ఫిదా అయ్యారు. ఇంకా ఆ తర్వాత కిక్ అని.. జల్సా అని.. జులాయి అని తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ బ్యూటీ బాలీవుడ్ లోను కొన్ని సినిమాలు తీసి ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు బై బై చెప్పింది.. అయితే ఈ మధ్యే రవి తేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటించినప్పటికీ ఆ సినిమా ఇలియానికి పెద్దగా హిట్ ఇవ్వలేదు. 

 

దీంతో ఆ తర్వాత ఓ హిందీ సినిమాకు ఓకే చెప్పిన ఇలియానా ఆ సినిమాలో అర్దాంతరంగా తప్పుకొని ఆతర్వాత మళ్లీ ఏ చిత్రంలో నటించకపోయేసరికి ఆమెపై అప్పట్లో భారీ స్థాయిలో రూమర్స్ వచ్చేసాయి. అవి ఎం అని అంటే?  ఆమె గర్భవతి అయ్యింది అని.. త్వరలోనే తల్లి కాబోతుంది అని వార్తలు వచ్చాయి. 

 

అయితే ఇలియానా గర్భవతి అని ఎన్నో కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేకపోయింది.. ఇలియానా కాస్త లావు అయ్యింది అంతే.. ఆ లావును పట్టుకొని ఆమె గర్భవతి అయ్యింది అని.. ఇవే ప్రూఫ్స్ అంటూ ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారు. చివరికి ఆమె గర్భవతి కాలేదు అని తెలుసుకొని సైలెంట్ అయ్యారు.                      

మరింత సమాచారం తెలుసుకోండి: