టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాజు.. ఎందరో అమ్మాయిల మనసును దోచుకున్న డార్లింగ్.. మిర్చి మిర్చి అంటూ అందరి మనసు గెలుచుకున్న వ్యక్తి ప్రభాస్. బాహుబలి లాంటి సినిమాలతో ప్రపంచ ప్రజలకు అభిమాన హీరోగా మారిన ప్రభాస్ పెళ్లి కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

ఎందుకంటే.. ప్రభాస్ పెళ్లి కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు.. ఇప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి ఎలా అయితే అందరూ ఎదురు చూస్తున్నారో స్టార్ హీరోయిన్ అనుష్క పెళ్లి కోసం కూడా అలాగే ఎదురు చూస్తున్నారు.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అనుష్క అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.. 

 

ప్రభాస్ పెళ్లి గురించి అయిన ఓ రకమైన వార్తలు వస్తున్నాయి.. అనుష్క పెళ్లి గురించి అయితే మరి దారుణం.. ఒకరోజు స్టార్ క్రికెటర్ తో పెళ్లి అంటారు.. మరోసారి దర్శకుడు కొడుకుతో పెళ్లి అంటారు.. మరోసారి విడాకులు తీసుకున్న వ్యక్తితో పెళ్లి అంటూ వార్తలు వేస్తున్నారు.. ఇలా ఎప్పటికప్పుడు అనుష్క.. ప్రభాస్ ల పెళ్లిపై తప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. 

 

ఇకపోతే.. వీరి ఇద్దరి వార్తలు వేరు వేరుగా రావడం వేరు.. ఇద్దరికీ పెళ్లి అని రావడం వేరు. వేరే వాళ్ళతో ప్రభాస్ పెళ్లి అంటే.. నా పరిస్థితి ఏంటి ప్రభాస్ అని అనుష్క అడిగినట్టు.. అదే అనుష్కకు వేరే వరుడితో పెళ్లి అంటే నా పరిస్థితి ఏంటి అనుష్క అని ప్రభాస్ అడిగినట్టు వార్తలు రాయడం.. లేదు అంటే.. ఇన్నాళ్లు వచ్చినవి గాసిప్స్ ఇప్పుడు రియల్.. నిజంగానే ఈసారి అనుష్క ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అని వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంటాయి.. అభిమానులు కూడా అంతే.. ఎన్ని సార్లు ఆ వార్తలు ఫేక్ అని తెలిసినా సరే ఏమో ఈసారి నిజం అవ్వచ్చు ఏమో అని ఆ న్యూస్ ఓపెన్ చేసి హైలెట్ చేస్తారు.. ఇలా ఈ ఇద్దరికీ పెళ్లి జరిగే వ‌ర‌కు వారానికి ఒకసారైనా వార్తలు వ‌స్తూ ఉంటాయి.. మరి వీళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి త్వరగా పెళ్లి చేసుకుంటారు ఏమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: