పాపం అనుష్క.. ఆమె పరిస్థితి చూస్తే ఎవరికైనా సరే గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే ఆమెపై ఈ మధ్యకాలంలో వచ్చిన వార్తలు అబ్బబ్బా సోషల్ మీడియాలో హాల్ చల్ చేశాయి అంటే నమ్మండి. ఆమె పెళ్లి గురించి ఆమెకు.. ఆమె కుటుంబానికి తెలియని వారందరితో లింకులు పెట్టేస్తున్నారు.. నా పెళ్లి మా అమ్మానాన్నా చూపించిన వారితోనే జరుగుతుందిరా బాబు అని అన్న సరే రోజుకు ఒకరితో పెళ్లి సంబంధం అంటగడుతున్నారు. 

 

మొదట ఏమో ప్రభాస్ తో పెళ్లి అన్నారు.. హా ఈ వార్త వినడానికి కూడా బాగుంది కదా! అని అందరూ అనుకున్నారు.. ఆ తర్వాత తెలిసింది.. ఆ న్యూస్ ఫేక్ అని.. దీంతో ఆ తర్వాత కొద్దీ రోజులు ఆ వార్తలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ.. మళ్లీ అప్పుడప్పుడు స్టార్స్ లా కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రభాస్ తో అనుష్క పెళ్లి వార్త అందరికి బోర్ కొట్టేసింది. దీంతో కొత్తదనం కోరుకున్నారు. 

 

ఇక అంతే అనుష్కకు స్టార్ క్రికెటర్ తో పెళ్లి అని వార్తలు వచ్చాయి.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత తెలిసింది. ఆ వార్తలు కూడా ఫేక్ ఏ అని... అంతటితో ఆగిపోతారా విల్లు.. ఆగలేదు.. మళ్లీ స్టార్ట్ చేశారు.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో అనుష్క పెళ్లి పీఠాలు ఎక్కబోతుంది అని.. అది హైలెట్ అయ్యిందా.. చివరికి అది కూడా ఫేక్ అని తెలిసింది. 

 

ఇక ఆతర్వాత అనుష్కకు కోపం వచ్చి మా తల్లితండ్రులు ఎవరిని చూపిస్తే వారితోనే తాళి కట్టించుకుంటా అని అనింది.. దానిపై కూడా ఫేక్ న్యూస్ ఏ.. అతనితోనే తాళి కట్టించుకుంటా: అనుష్క స్టేట్మెంట్ అని వార్త రాసేశారు. ఇప్పుడు టాప్ దర్శకుడు రాఘవేంద్ర రావు కొడుకుతో పెళ్లి అని వార్త రాశారు.. అయితే అతను ఇది వారికే బాలీవుడ్ రచయిత్రిని పెళ్లి చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చిన అతను అనుష్క ప్రేమలో పడ్డాడు అని.. ఈ ఏడాదిలో వీరి పెళ్లి అని వార్తలు వచ్చాయి.. ఇలా రోజుకు ఒకరితో అనుష్క పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి.. ఇంకొన్ని రోజులు పోతే ఏ ముసలోడుతోను అనుష్క పెళ్లి అని రాసిన రాసేస్తారు. అలా ఉంది సోషల్ మీడియా. 

మరింత సమాచారం తెలుసుకోండి: