రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే? రాజ్ తరుణ్ అతి తక్కువ కాలంలోనే అతని నటనతో తెలుగు ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు.. మొదట్లో తన టాలెంట్ తో యూట్యూబ్ లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ దూసుకెళ్తున్న రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 

 

ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాడు. తన కెరీర్‌లో మంచి పాత్రలు చేసిన రాజ్ తరుణ్ కొద్ది సమయంలోనే లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్త మావ, ఆడోరకం ఇడోరకం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాడు. 

 

అయితే అలా దగ్గర అయినా ఈ హీరో ఎంత తక్కువ సమయంలో తన సత్తా చాటాడో, అంతే తక్కువ సమయంలో ఫేడవుట్ కూడా అయ్యాడు. వరుసగా ఫ్లాప్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు బోర్ కొట్టేశాడు. అలా కొట్టడానికి కారణం రాజ్ తరుణ్ కు ఉన్న పొగరు ఏ అంటున్నారు ఇండస్ట్రీలో కొందరు.. 

 

ఎందుకంటే రాజ్ తరుణ్ కు చాలా పొగరు అని.. హీరో అయినప్పటికీ కుర్రాడి వేషాలు వేస్తాడు అని.. అది చాలా మందికి చిరాకు తెప్పించింది అని ఇండస్ట్రీలో టాక్. అయితే రాజ్ తరుణ్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో తన పొగరుతో ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఇగో హర్ట్ చేశాడు అని.. అతని ఇగో హర్ట్ అవ్వడంతో రాజ్ తరుణ్ కెరీర్ తొక్కేశారు అని ఇండస్ట్రీలో టాక్. 

 

అయితే ఆ ప్రొడ్యూసర్ పిలిచి మరి అవకాశం ఇస్తే.. ఛీ పో.. ఆ రెమ్యూనరేషన్ కు ఎవడు నటిస్తాడు.. అని అన్నాడని.. అది ఆ ప్రొడ్యూసర్ కు కోపం తెప్పించింది అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత ఆ ప్రొడ్యూసర్ కు సారీ కూడా చెప్పాడు అని.. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ కు బాగా దగ్గర అయ్యాడు అని సమాచారం. మరి రాజ్ తరుణ్ కెరీర్ ఇప్పటికైనా ఒక రేంజ్ కు వస్తుంది ఏమో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: